
మంచి ఆరోగ్యం కోసం మంచి పోషకాహారం చాలా ముఖ్యం. అలాంటి ఆహారాల్లో చేపలు అతిముఖ్యమైనవి. చేపల్ని తరచూ తినడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. చేపలు తినటం వల్ల మన శరీరానికి కావాల్సిన చేప నూనె సమృద్ధిగా అందుతుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మానికి మంచి నిగారింపు, ఆరోగ్యాన్ని అందిస్తాయి. చేపనూనెలో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. దీంతో అనేక ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.
ఫిష్ ఆయిల్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చేపనూనెలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఐకోసాపెంటోనోయిక్ ఆమ్లం, డోకోసాహెక్సేనోయిక్ ఆమ్లం. ఇది ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తగ్గించడంలో మెడిసిన్‌లా పనిచేస్తుంది. ఇది గుండె జబ్బులా ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం.. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే మీ గుండె ఆరోగ్యం, బ్రెయిన్ హెల్త్‌తో పాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది థైరాయిడ్ సమస్యను దూరం చేయడంలో సహాయపడుతుంది. ఐయోడిన్ జీవక్రియ రేటును పెంచుతుంది.
చేప నూనె చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఫిష్ ఆయిల్‌లోని గుణాలు హార్ట్ హెల్త్, బ్రెయిన్ హెల్త్, ఇతర హెల్త్ బెనిఫిట్స్ అనేకం ఉన్నాయి. ఫిష్ ఆయిల్ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇది అనేక చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ నుండి రక్షించడంలో సాయపడుతుంది. ఇవి చర్మంపై ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. ఫిష్ ఆయిల్‌లో విటమిన్ ఎ లభిస్తుంది. ఇది కంటిని ఆరోగ్యంగా మార్చుతుంది. ఫిష్ ఆయిల్ తీసుకుంటే కంటి సంబంధిత సమస్యలు రావు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..