ఎక్కిళ్లు ఆగట్లేదా.. నీళ్లతో పనిలేదు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 10 సెకన్లలోనే మాయం..

ఎక్కిళ్లు వస్తే చాలు.. పక్కనున్న వాళ్లు ఇచ్చే ఏకైక సలహా నాలుగు గుటకల నీళ్లు తాగు.. కానీ కొన్నిసార్లు గ్లాసుల కొద్దీ నీళ్లు తాగినా ఆ ఎక్కిళ్లు అస్సలు ఆగవు. గొంతులో మంట, ఛాతీలో నొప్పితో ప్రాణం అల్లాడిపోతుంది. అయితే ఈ సమస్యకు మన ఇంట్లోని వంటగదిలోనే ఒక అద్భుతమైన పరిష్కారం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఎక్కిళ్లు ఆగట్లేదా.. నీళ్లతో పనిలేదు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 10 సెకన్లలోనే మాయం..
How To Stop Hiccups In 10 Seconds

Updated on: Aug 09, 2026 | 5:18 PM

ఎక్కిళ్లు ఒకసారి మొదలైతే అంత సులువుగా ఆగవు. వరుసగా ఎక్కిళ్లు వస్తుంటే గొంతులో ఏదో పేలిపోతున్నట్లు, ప్రాణం విలవిలలాడుతున్నట్లు అనిపిస్తుంది. అలాంటి సమయంలో పక్కనున్న వాళ్లు వెంటనే కొన్ని నీళ్లు తాగు అని సలహా ఇస్తారు. అయితే, లీటర్ల కొద్దీ నీళ్లు తాగినా కొన్నిసార్లు ఎక్కిళ్లు అస్సలు తగ్గవు. మరి ఈ ఇబ్బంది నుంచి తక్షణమే ఉపశమనం పొందడానికి ఒక సులభమైన శాస్త్రీయ మార్గం ఉందని మీకు తెలుసా? ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండా, మీ ఇంట్లో లభించే ఒక చిన్న వస్తువుతో కేవలం 10 నుండి 15 సెకన్లలో మ్యాజిక్‌లా ఎక్కిళ్లను ఆపేయవచ్చు. మన ఛాతీకి, పొట్టకు మధ్య భాగంలో డయాఫ్రమ్ అనే ఒక ముఖ్యమైన కండరం ఉంటుంది. ఇది అకస్మాత్తుగా తీవ్రంగా సంకోచించినప్పుడు, గాలి వేగంగా ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో మన వోకల్ కార్డ్స్ ఒక్కసారిగా మూసుకుపోతాయి. దీనివల్ల హికప్ అనే శబ్దం బయటకు వస్తుంది. వైద్య శాస్త్రం ప్రకారం.. ఈ మొత్తం ప్రక్రియను వేగస్ నాడి నియంత్రిస్తుంది. ఇది మన మెదడు నుంచి మొదలై కడుపు వరకు వ్యాపించి ఉండే అత్యంత సున్నితమైన, ప్రధానమైన నాడి.

నాలుక కింద చిటికెడు చక్కెర..

పరిశోధకుల ప్రకారం.. ఎక్కిళ్లు తగ్గాలంటే ఈ వేగస్ నాడి పనితీరును క్షణకాలం పాటు ప్రేరేపించాలి లేదా దాని దృష్టి మళ్లించాలి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. మీ నాలుక కింద చిటికెడు చక్కెర లేదా చిన్న తీపి పదార్థాన్ని ఉంచుకోవడం. మీరు నాలుక కింద తీపి పదార్థాన్ని ఉంచిన వెంటనే, నోటిలోని రుచి నాడీ వ్యవస్థ నేరుగా వేగస్ నాడికి ఒక శక్తివంతమైన సంకేతాన్ని పంపుతుంది. దీంతో మెదడు ఎక్కిళ్లను పక్కన పెట్టి, ఆ కొత్త తీపి రుచి సంకేతంపై దృష్టి సారిస్తుంది. శాస్త్రీయ పరిభాషలో దీనిని రిఫ్లెక్స్ రీసెట్ లేదా దృష్టి మళ్లింపు అని పిలుస్తారు.

దీనికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా?

ఇది కేవలం చిట్కా మాత్రమే కాదు, దీని వెనుక బలమైన వైద్యపరమైన ఆధారాలు ఉన్నాయి. డాక్టర్ ఎడ్గార్ ఎంగెల్‌మన్ నిర్వహించిన 1971 లో నిర్వహించిన పరిశోధన వివరాలు ప్రఖ్యాత ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఒక చెంచా చక్కెరను నాలుక కింద ఉంచడం వల్ల వేగస్ నాడి ప్రేరేపితమై, డయాఫ్రమ్ యొక్క అసంకల్పిత సంకోచాలు తక్షణమే శాంతిస్తాయని ఈ అధ్యయనంలో నిరూపితమైంది.

ఈ సారి ఎక్కిళ్లు వస్తే ఇలా చేయండి..

  • లీటర్ల కొద్దీ నీళ్లు తాగి పొట్ట నింపుకోవాల్సిన అవసరం లేదు.
  • నేరుగా వంటగదిలోకి వెళ్లి కొద్దిగా చక్కెరను లేదా ఒక చిన్న తీపి ముక్కను తీసుకోండి.
  • దానిని మీ నాలుక కింద పెట్టుకుని, నీళ్లు మింగకుండా 10 నుండి 15 సెకన్ల పాటు నిశబ్దంగా ఉండండి.
  • ఆ చక్కెర నోటిలోనే నెమ్మదిగా కరగనివ్వండి.
  • కొద్ది సెకన్లలోనే వేగస్ నాడి రీసెట్ అయి, ఎక్కిళ్లు మాయమవ్వడం మీరే గమనిస్తారు.
Loading...
Unable to load recommendations.
Follow Us