
వంటగదిలో మనం తరచుగా వాడే పాత్రలు, గోడలు, వంట సామాన్లపై పసుపు మరకలు పడి గట్టిగా అంటుకుపోవడం చాలా కామన్. దీని వల్ల శుభ్రం చేయడం కాస్త కష్టం అనిపిస్తుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను తక్కువ శ్రమతోనే పరిష్కరించవచ్చు.
బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి పేస్ట్‌లా కలపండి. ఆ పేస్ట్‌ను పసుపు మరకలు ఉన్న చోట పూసి సుమారు 15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత తడి బట్టతో గట్టిగా తుడిస్తే మరకలు పోతాయి.
వెనిగర్ లో కొద్దిగా నీరు కలిపి స్ప్రే బాటిల్ లో తీసుకోండి. పసుపు మరకలు ఉన్న ప్రదేశంపై చల్లండి. కాసేపటి తర్వాత మెత్తని బట్టతో తుడిచేయండి. ఇది పసుపు మరకలను తొలగించడంలో సహాయపడుతుంది.
నిమ్మకాయలో ఉండే సహజ యాసిడ్ వల్ల పసుపు మరకలను సులభంగా తొలగించవచ్చు. నిమ్మరసాన్ని కొంచెం నీటిలో కలిపి.. మరక ఉన్న చోట రాసి కొంతసేపు అలాగే ఉంచండి. తర్వాత బట్టతో తుడిచేస్తే పసుపు మరకలు కనిపించకుండా పోతాయి.
కొన్ని సందర్భాల్లో పసుపు మరకలు ఉన్న వస్తువులను నేరుగా సూర్యకాంతి పడేలా బయట ఉంచడం ద్వారా కూడా మరకలు మెల్లగా తగ్గుతాయి. సూర్యకాంతి వేడితో రంగు ఆమ్లత్వం తగ్గి చివరికి పోతుంది. ఈ పద్ధతిని ఎక్కువసేపు పాటిస్తే మరింత మంచి ఫలితం పొందవచ్చు.
ఈ చిట్కాలన్నీ మీ వంటగదిని సహజంగా శుభ్రంగా ఉంచడానికి.. రసాయనాలు లేకుండా ఇంట్లో దొరికే వాటితోనే సురక్షితంగా ఉండే పద్ధతులు. ఇవన్నీ మీకు బాగా ఉపయోగపడుతాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.