Telugu News Lifestyle How to Make DIY Natural Floor Cleaner at Home for Sparkling White Tiles
బకెట్ నీళ్లలో ఇది 2 చుక్కలు వేస్తే చాలు.. మీ ఇంటి నేల మొత్తం అద్దంలా మెరిసిపోవాల్సిదే..
ఇంట్లో వైట్ టైల్స్ లేదా మార్బుల్ ఫ్లోరింగ్ ఉంటే లుక్ గ్రాండ్‌గా ఉంటుంది.. కానీ కాస్త దుమ్ము పడినా, చిన్న మరక పడినా ఇల్లంతా మురికిగా కనిపిస్తుంది. పైగా వర్షాకాలంలో జిడ్డు, చిన్న చిన్న కీటకాల బెడద మరీ ఎక్కువ. మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ లిక్విడ్స్ బదులు, వంటింట్లోని చిట్కాలతో రూపాయి ఖర్చు లేకుండా తయారుచేసే న్యాచురల్ ఫ్లోర్ క్లీనర్ మీ ఇంటిని అద్దంలా ఎలా మెరిపిస్తుందో తెలుసుకుందాం..
ఇంట్లో వైట్ టైల్స్ ఉంటే ఇల్లు ఎంతో అందంగా, విశాలంగా కనిపిస్తుంది. కానీ ఈ నేలను క్లీన్‌గా ఉంచుకోవడం పెద్ద సవాల్. చిన్న మరక పడినా, దుమ్ము చేరినా లేదా పిల్లలు తిరిగిన పాదముద్రలు పడినా వెంటనే స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో నేల జిడ్డుగా మారడం, తేమ వల్ల చిన్న చిన్న కీటకాలు, ఈగలు, దోమల బెడద ఎక్కువవడం సర్వసాధారణం. మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ఫ్లోర్ క్లీనర్ల బదులు, వంటింట్లోని సహజ పదార్థాలతో ఎంతో సులభంగా హోమ్‌మేడ్ క్లీనర్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది ఎలాంటి హాని చేయకపోగా.. నేలను అద్దంలా మెరిపించి, ఇల్లంతా మంచి సువాసనను పంచుతుంది.
దుర్వాసనకు చెక్: బేకింగ్ సోడా చెడు వాసనలను పీల్చుకుంటుంది.
కీటకాలు దూరం: కర్పూరం, ఉప్పు సహజ క్రిమిసంహారకాలుగా పనిచేసి ఈగలు, చీమలు, చిన్న కీటకాలు రాకుండా అడ్డుకుంటాయి. ఎసెన్షియల్ ఆయిల్ ఇల్లంతా రోజంతా ఫ్రెష్ సువాసనను అందిస్తుంది.