Cooking Oil: మీరు వంటల్లో వాడే నూనె కల్తీదో.. కాదో..! ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా కనిపెట్టొచ్చు..

మన ఇంట్లో వాడే ఆవ నూనె కల్తీదో.. కాదో.. తెలుసుకోండి ఇలా.. నూనెను కొనుగోలు చేసేటప్పుడు బ్రాండ్ పేరు, గడువు తేదీ, FSSAI నెంబర్ లాంటి లేబుల్స్ కచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

Cooking Oil: మీరు వంటల్లో వాడే నూనె కల్తీదో.. కాదో..! ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా కనిపెట్టొచ్చు..
Cooking Oil

Updated on: Jan 16, 2026 | 9:45 AM

ప్రతీ ఇంటి వంటగదిలో ఆవ నూనె కంపల్సరీ.. వంటల్లోనే కాదు.. ప్రతీ ఫుడ్‌లో రుచిని పెంచేందుకు కాసింత నూనె కావాల్సిందే. ఆయుర్వేదంలో జుట్టు సంరక్షణకు, మసాజ్‌లకు దీనిని విరివిగా ఉపయోగిస్తారు. అయితే ఇటీవల కాలంలో ఆవ నూనె కల్తీ ఎక్కువైపోయింది. స్వచ్ఛమైన ఆవ నూనెకు, నకిలీ ఆవ నూనెకు మధ్య తేడాను గుర్తించడంలో ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కుంటున్నారు. కల్తీ చేసిన ఆవ నూనె ఆరోగ్యానికి హానికరం. అందువల్ల, ఆవ నూనెను కొనుగోలు చేసేటప్పుడు లేదా ఉపయోగించే ముందు దాని స్వచ్ఛతను నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం ఇంట్లోనే కొన్ని సులభమైన పద్దతులలో కల్తీ ఏదో ఈజీగా తెలుసుకోవచ్చు. ఆవ నూనె స్వచ్ఛతను తెలుసుకోండి ఇలా..

ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు

  • వైట్ పేపర్ టెస్ట్..

శుభ్రమైన వైట్ పేపర్ ఒకటి తీసుకుని దానిపై రెండు మూడు చుక్కల ఆవ నూనె వేయండి. మరక ముదురు పసుపు రంగులో ఉండి కొద్దిగా జిగటగా ఉంటే స్వచ్ఛమైనది. తేలికగా మారి, వైట్ పేపర్ మొత్తం వ్యాపిస్తే కల్తీ కావచ్చు.

  • అయోడిన్ టెస్ట్..

ఒక టీస్పూన్ నూనెలో రెండు చుక్కల అయోడిన్ కలపండి. నూనె రంగు మారకపోతే స్వచ్ఛమైనది. నీలి లేదా నలుపు రంగు కనిపిస్తే స్టార్చ్ లేదా కల్తీ అయినట్టే.

  • అరచేతితో టెస్ట్ చేసే పద్దతి..

అరచేతిలో కొద్దిగా నూనె తీసుకుని రెండు చేతులతో రుద్దండి. పసుపు రంగు కనిపిస్తే లేదా రసాయనం లాంటి వాసన వస్తే నకిలీది. నిజమైన ఆవ నూనె ఘాటైన వాసన వస్తే.. అది స్వచ్ఛమైనది.

  • వేడి చేసే పద్దతి..

నూనెను ఒక పాన్‌లో వేసి తేలికపాటిగా వేడి చేయండి. నిజమైన నూనెను వేడి చేసినప్పుడు బలమైన పొగ, ఘాటైన వాసన వస్తుంది. కల్తీ నూనె తక్కువ పొగ, తేలికపాటి వాసనను ఇస్తుంది.

  • టేస్ట్ చేయండి..

పచ్చి ఆవ నూనెను రుచి చూస్తే నాలుకపై కొంచెం మంట, చేదు రుచిని అందిస్తుంది. కల్తీ నూనె చప్పగా లేదా వింత రుచిని కలిగి ఉంటుంది. చివరగా, ఆవ నూనెను కొనుగోలు చేసేటప్పుడు దాని లేబుల్‌పై బ్రాండ్ పేరు, గడువు తేదీ, FSSAI నెంబర్‌ను తప్పకుండా పరిశీలించండి. ఈ నేచురల్ పద్ధతుల ద్వారా కల్తీ నూనెకు ఈజీగా చెక్ పెట్టండి.

ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.