కుండీలోనే నిమ్మ చెట్టును పెంచి కుప్పలు కుప్పలుగా కాయలు పండించే సీక్రెట్ ఇదే!

సొంత పెరట్లో కాసిన తాజా పూలు, పండ్లు, కూరగాయలను వాడుకోవడంలో ఉండే తృప్తే వేరు. అయితే, స్థలం తక్కువగా ఉందనే కారణంతో చాలామంది ఇష్టమైన చెట్లు, మొక్కలను పెంచడానికి వెనుకాడుతుంటారు. కానీ, సరైన పద్ధతులు పాటిస్తే చిన్న బాల్కనీ లేదా టెర్రస్ (మిద్దె తోట) పై కుండీలలోనే మీరు కోరుకున్న మొక్కలను అద్భుతంగా పెంచ్చుకోవచ్చు. ఇందుకు ఉపయోగపడే కొన్ని గార్డెనింగ్ టిప్స్‌ ఇక్కడ ఉన్నాయి. వీటితో ప్రతి ఇంట్లోనూ ఉపయోగపడే నిమ్మ చెట్టును కుండీలో పెంచడంలో ఎలాగో తెలుసుకుందాం..

కుండీలోనే నిమ్మ చెట్టును పెంచి కుప్పలు కుప్పలుగా కాయలు పండించే సీక్రెట్ ఇదే!
Lemon Tree In Container

Updated on: Jul 02, 2026 | 12:46 PM

సొంతంగా ఇంట్లోనే నిమ్మ చెట్టును పెంచుకోవడం చాలా సులభం. తక్కువ స్థలం ఉన్నవారు కనీసం 12 నుండి 15 ఇంచుల పరిమాణం గల పెద్ద కుండీని ఎంచుకోవాలి. నిమ్మ చెట్టు వేళ్లు బాగా విస్తరించడానికి తగినంత స్థలం అవసరం. అందువల్ల నిమ్మ మొక్కను నాటడానికి కనీసం 12 నుండి 15 ఇంచుల వెడల్పు, లోతు ఉన్న పెద్ద ప్లాస్టిక్ లేదా మట్టి కుండీని ఎంచుకోవాలి. కుండీ అడుగు భాగంలో అదనపు నీరు బయటకు పోవడానికి ఖచ్చితంగా రంధ్రాలు (Drainage holes) ఉండాలి.

ఇప్పుడు, నిమ్మ మొక్కకు నీరు నిల్వ ఉండే మట్టి అస్సలు పడదు. నీరు నిల్వ ఉంటే వేళ్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి 50శాతం సాధారణ తోట మట్టి, 20శాతం ఇసుక, 30శాతం వర్మీకంపోస్ట్ లేదా బాగా ఎండిన పశువుల ఎరువు కలిపి కుండీని నింపుకోవాలి. నిమ్మ చెట్టు సిట్రస్ జాతికి చెందినది కాబట్టి దీనికి ఎండ చాలా అవసరం. మీ ఇంట్లో రోజుకు కనీసం 5 నుండి 6 గంటల పాటు నేరుగా సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో ఈ కుండీని ఉంచాలి. కుండీలోని పైమట్టి ఎండిపోయినట్లు అనిపించినప్పుడే నీరు పోయాలి. అతిగా నీరు పోస్తే పూత రాలిపోతుంది.

కుండీలో పెరిగే మొక్క కాబట్టి చెట్టు ఒక క్రమ పద్ధతిలో, గుబురుగా పెరగడానికి ఎండిపోయిన లేదా అడ్డంగా పెరుగుతున్న కొమ్మలను క్రమం తప్పకుండా కత్తిరించాలి. మొక్క వేగంగా పెరిగి ఎక్కువ కాయలు కాయడానికి, ప్రతి 20 నుండి 30 రోజులకు ఒకసారి గుప్పెడు వర్మీకంపోస్ట్ లేదా వేపపిండి ఎరువుగా అందించాలి. మొక్క పూత దశలో ఉన్నప్పుడు ఎప్సమ్ సాల్ట్ (Epsom Salt) నీటిని స్ప్రే చేస్తే పూత రాలకుండా కాయలుగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

మార్కెట్ నుండి నమ్మకమైన నర్సరీ ద్వారా గ్రాఫ్టింగ్ (అంటుకట్టిన) చేసిన 12 నెలలకే కాపుకు వచ్చే నిమ్మ రకాలను ఎంచుకుంటే తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ మీ ఇంటి లోపలే ఆర్గానిక్ నిమ్మకాయలను సులభంగా పండించుకోండి!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us