Rat Removal: ఇంట్లో ఎలకల బెడదా ఎక్కువైందా? ఈ సింపుల్ చిట్కాలతో క్షణాల్లో తరిమి కొట్టేయండి..

Stop Rat Menace at Home: మీ ఇంట్లో ఎలుకలు ఉన్నాయా.. అవి ఇంటిని మొత్తాన్ని చిందరవందర చేస్తున్నాయా? కొత్త బట్టలను కొరికేస్తున్నాయా?.. వాటిని తరిమికొట్టేందుకు ప్రయత్నించి మీరు విగిసిపోయారా? అయితే ఈ వార్త మీ కోసమే.. ఒక సింపుట్‌ చిట్కాతో మీరు ఇంట్లో ఉన్న ఎలుకలను శాశ్వతంగా బయటకు వెల్లగొట్టవచ్చు. ఇందకు పెద్దగా కష్టపడాల్సిన పనికూడా లేదు. అదెలానో చూద్దాం పదండి.

Rat Removal: ఇంట్లో ఎలకల బెడదా ఎక్కువైందా? ఈ సింపుల్ చిట్కాలతో క్షణాల్లో తరిమి కొట్టేయండి..
Get Rid Of Rats Naturally

Updated on: May 09, 2026 | 7:43 PM

ప్రతి ఇంట్లో ఉండే ప్రధాన సమస్యల ఎలుకలు. ఇవి ఒక్కసారి ఇంట్లోకి ఎలుకలు దూరాయంటే ఇక అంతే సంగతులు. ఆహార ధాన్యాల నుంచి ఖరీదైన బట్టల వరకు దేన్నీ వదలకుండా కొరికి పాడుచేస్తుంటాయి. ఎలుకలను వినాయకుడి వాహనంగా భావించి పూజించినప్పటికీ, అవి ఇంట్లో చేసే విధ్వంసాన్ని మాత్రం ఎవరూ భరించలేరు. ఈ క్రమంలోనే చాలామంది ఎలుకలను వదిలించుకోవడానికి బోన్లు పెట్టడం లేదా విషం పెట్టడం వంటివి చేస్తుంటారు. కానీ కొందరికి మాత్రం మూగజీవాలను చంపడం ఇష్టం ఉండదు. అలాంటి వారి కోసమే ఈ చిట్కా.. దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కేవలం పిల్లలు ఆడుకునే బెలూన్ సహాయంతో ఎలుకలను శాశ్వతంగా ఇంటి నుంచి తరిమికొట్టవచ్చు. అదెలానో చూద్దాం.

ఎలుకలను తరిమికొట్టడం ఎలా

ఇంట్లోని ఎలుకలను తరిమికొట్టేందుకు ముందుగా కొంత గోధుమ పిండిని తీసుకోండి. అందులో ఏదైనా ఎక్స్‌పైర్ అయిన ట్యాబ్‌టెట్‌ను తీసుకొని దాన్ని మెత్తగా దండి పొడిగా చేయండి. దాన్ని ఆ గోధుమ పిండితో కలిపి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు. ఒక బెలూన్‌ను తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోండి. ఇప్పుడు మీరు ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమంలో ఈ బెలూన్ ముక్కలను ఉంచి చిన్న చిన్న ఉండలుగా తయారు చేయండి. ఇప్పుడు ఆ ఉండలను ఎలుకలు ఎక్కువగా తిరిగే చోట, అంటే బీరువా వెనుక, వంటగది మూలలు లేదా స్టోర్ రూమ్‌లలో ఈ ఉండలను ఉంచండి.

ఇది ఎలా పనిచేస్తుంది?

ఈ పిండి ఉండలను ఎలుకలు తిన్నప్పుడు, అందులోని బెలూన్ ముక్కలు వాటికి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. దీనివల్ల ఎలుకలు చనిపోవు కానీ, ఆ ప్రదేశం తమకు సురక్షితం కాదని భావించి కేవలం 2 నిమిషాల్లోనే ఇంటి నుండి బయటకు పారిపోతాయి. ఎలుకలను చంపకుండానే ఇంటి నుండి తరిమికొట్టడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. మీరు కూడా ఎలుకల సమస్యతో బాధపడుతుంటే, ఈ సింపుల్ చిట్కాను ఒకసారి ట్రై చేసి చూడండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us