పొట్టేలు తలకాయ కూర వండటం తెలియట్లేదా.. అమ్మమ్మల కాలం నాటి టిప్స్ ఇవే!

Updated on: Jan 16, 2026 | 10:27 AM

పొట్టేలు తలకాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా పొట్టేలు తలకాయ కూర వండుకొని తినాలనుకుంటారు. ఇది రుచి ఇవ్వడమే కాకుండా దీని వలన అనేక ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు అయితే తలయకాయ కూర వండేటప్పడు కొంత మందికి ఎంత బాగా వండినా, మంచి టేస్ట్ రాదు, మరి తలకాయ కర్రీ ఎలా వండటం వలన రుచి అద్భుతంగా ఉంటుంది? దీని కోసం మనం ఇప్పుడు అమ్మమ్మల కాలం టిప్స్ ఎవో చూసేద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు :  పొట్టేలు తలకాయ , శుభ్రం చేసిన మాంసం కిలో, పసుపు చిటికెడు, ఆయిల్ ఒక టీ స్పూన్,  పచ్చిమిర్చి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. ముందుగా తలకాయ మాంసాన్ని ఉడకబెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని అందులో కొంచెం పసుపు, వన్ టీస్పూన్ ఆయిల్ వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి.  తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముక్క మంచిగా ఉండికిందో లేదో చూసి, ఉడికితే పక్కన పెట్టుకోవాలి.

2 / 5
 ఇప్పుడు పొట్టేలు తలకాయ కర్రీ ఎలా వండాలో చూద్దాం. ముందుగా కర్రీ కోసం మంచి మసాలాలు తయారు చేసుకుందాం. దీని కోసం, లవంగాలు మూడు నాలుగు, యాలకులు రెండు, ధనియాలు అర టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి, అంగుళం ముక్క, జాపత్రి కొద్దిగా, అనాసపువ్వు ఒకటి, మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి.

3 / 5
వీటన్నింటిని లో ఫ్లేమ్‌లో వేయించుకొని, చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి.  తర్వాత ఉల్లిపాయను తీసుకొని, గుత్తి వంకాయ టైప్‌లో కట్ చేసుకోవాలి దీనిని స్టవ్ మీద మంచిగా కాల్చుకొని, చల్లారిన తర్వాత దీనిని గ్రైడ్ చేసి పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఎండు కొబ్బరిని కూడా కాల్చుకొని పౌడర్‌లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

4 / 5
 ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, అందులో కర్రీకి సరిపడ నూనె పోయాలి. తర్వాత, మిర్చీ,  ఉల్లిపాయ పేస్ట్ వేసి, వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇవి వేగిన తర్వాత అందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న తలకాయ కర్రీని వేయాలి. మంచిగా కలుపుతూ, సరిపడ కారం, ఉప్పు వేసి, రెండు నిమిషాలు ఉడకబెట్టి, తర్వాత మళ్లీ అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాలు వేసి కలుపుకోవాలి.

5 / 5
ఇలా ఒక పది నిమిషాల పాటు ముక్క మంచిగా ఉడికేలా చూసుకోవాలి. తర్వాత కొత్తిమీర, మీకు ఇష్టం ఉంటే కొంచెం పూ దీన వేస్తే ఖతం, అమ్మమ్మల కాలంలో వారు వండే పద్ధతిలో లాగ ఉండే పొట్టేల్ తలకాయ కర్రీ రెడీ.