కడుపులో గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం..

|

Jul 28, 2024 | 2:56 PM

భారతీయులు సాధారణ రోజుల్లో కూడా మార్కెట్‌లో దొరికే అనారోగ్యకరమైన, నూనెతో కూడిన ఆహార పదార్థాలను తింటారు.. ఇంకా పెళ్లిళ్లు, పార్టీల సమయంలో అయితే.. మనం పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.. పార్టీలు, పంక్షన్లలో దొరికే పదార్థాలన్నింటిని టేస్ట్ చేస్తారు.

కడుపులో గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం..
Home Remedies For Gastritis
Follow us on

భారతీయులు సాధారణ రోజుల్లో కూడా మార్కెట్‌లో దొరికే అనారోగ్యకరమైన, నూనెతో కూడిన ఆహార పదార్థాలను తింటారు.. ఇంకా పెళ్లిళ్లు, పార్టీల సమయంలో అయితే.. మనం పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.. పార్టీలు, పంక్షన్లలో దొరికే పదార్థాలన్నింటిని టేస్ట్ చేస్తారు. సాధారణంగా తినే దానికంటే.. ఇంకా కొంచెం ఎక్కువగానే తింటారు.. ఎక్కువ తినడం వల్ల, వారికి కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. దీంతో రోజువారీ జీవితంలో సాధారణ కార్యకలాపాలు చేయడం కష్టంగా మారుతుంది.

అయితే.. సాధారణంగా ఒక్కసారి ఏర్పడితే ఏం కాదు కానీ.. పదే పదే కడుపులో మీ కడుపులో ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి అవుతుంటే, మీరు భవిష్యత్తులో ఎప్పుడూ ఎక్కువ స్పైసీ, ఆయిల్ ఫుడ్ తినకూడదని గుర్తుంచుకోవాలి.. ఇంకా మంచి ఆహారపదార్థాలను తీసుకోవాలి.. గ్యాస్ సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తుంది.. మీరు ఎప్పుడైనా అలాంటి సమస్యను ఎదుర్కొంటే, దానిని నివారించడానికి మీరు కొన్నింటిని తినవచ్చు.

సాధారణంగా కడుపులో గ్యాస్ ఏర్పడినప్పుడు కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలు పాటించడం ద్వారా గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.. అవేంటో తెలుసుకోండి..

కడుపులో గ్యాస్ ఉన్నట్లయితే వీటిని తీసుకోండి..

కొబ్బరి నీళ్లు తాగండి: మీకు కడుపులో గ్యాస్ సమస్య ఉంటే, మీరు తప్పనిసరిగా కొబ్బరి నీరు త్రాగాలి. ఇది సహజమైన, చాలా ఆరోగ్యకరమైన పానీయం. దీన్ని రోజుకు 2-3 సార్లు తాగితే శరీరం హైడ్రేటెడ్ గా ఉండటమే కాకుండా జీర్ణక్రియకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి.

కీర దోసకాయ తినండి: దోసకాయలో చాలా ఎక్కువ నీరు ఉంటుంది.. అందుకే ఇది మన పొట్టకు తగిన ఆహారంతోపాటు.. ఎలాంటి గ్యాస్ ఏర్పడకుండా చేస్తుంది. అన్నం తినే ముందు మీరు కీర దోసకాయను సలాడ్‌గా తింటే మంచిది.

నిమ్మకాయ నీరు త్రాగాలి: మీరు గ్యాస్ నుండి త్వరగా ఉపశమనం పొందాలనుకుంటే, నిమ్మరసం తాగండి.. ఇలా చేయడం వల్ల కడుపుకు చాలా ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని అందులో ఒక నిమ్మకాయ పిండుకుని రుచికి తగినట్లుగా నల్ల ఉప్పు లేదా సాధారణ ఉప్పు వేసి తాగాలి.

అరటిపండు తినండి: కడుపులో గ్యాస్ సమస్య వచ్చినప్పుడల్లా అరటిపండు తినండి. ఇది చాలా సాధారణమైన పండు.. దీని కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. అరటిపండులో ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే పీచు అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..