Hidden Sodium: ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట..! వీటిపై ఓ లుక్కేయండి

అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పు తక్కువగా తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే మనకు ఆరోగ్యకరంగా అనిపించే కొన్ని ఆహారాలలో కూడా 'దాగి ఉన్న సోడియం' ఉంటుందని, ఇది దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ రకమైన..

Hidden Sodium: ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట..! వీటిపై ఓ లుక్కేయండి
Hidden Sodium In Healthy Food

Updated on: Apr 13, 2026 | 9:43 PM

ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు ఆరోగ్యానికి హానికరం అనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పు తక్కువగా తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే మనకు ఆరోగ్యకరంగా అనిపించే కొన్ని ఆహారాలలో కూడా ‘దాగి ఉన్న సోడియం’ ఉంటుందని, ఇది దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ రకమైన రహస్యంగా ఉప్పు దాగి ఉన్న ఆహారాలు ఏమిటో? రోజుకు ఎంత ఉప్పు తినాలో ఇక్కడ తెలుసుకుందాం..

దాగి ఉన్న సోడియం అంటే ఏమిటి?

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలలో మాత్రమే సోడియం ఉంటుందనేది ఒక అపోహ. మనం రోజూ తినే కొన్ని ఆహార పదార్థాలలో ఉప్పు రుచిని స్పష్టంగా గుర్తించలేకపోయినప్పటికీ, వాటిలో గణనీయమైన మొత్తంలో సోడియం ఉంటుంది. వైద్య పరిభాషలో దీనిని hidden sodium అంటారు. ఇది శరీరంలో నెమ్మదిగా పేరుకుపోయి బీపీ, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

చాలా మంది చపాతీ తేలికైన, ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తారు. అయితే ఒక్క చపాతీలో 150 నుండి 230 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. అల్పాహారంగా ఎక్కువ మొత్తంలో చపాతీ తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరగవచ్చు. అదేవిధంగా ప్రాసెస్ చేసిన ఆహారాలలో కూడా ఉప్పు అధికంగా ఉంటుంది. ఈ ఆహారాలు ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడినప్పటికీ వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అందువల్ల, ప్యాకెట్‌పై ఉన్న సోడియం పరిమాణాన్ని గమనించి ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

అసలు రోజుకు ఎంత ఉప్పు తీసుకోవాలి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. కానీ మనలో చాలా మంది తెలియకుండానే ఇంతకంటే ఎక్కువ ఉప్పును తీసుకుంటున్నారు. బ్రెడ్, తృణధాన్యాలు వంటి ఆహార పదార్థాల నుంచి శరీరంలోకి అదనపు ఉప్పు చేరుతోంది. ఈ విధంగా శరీరంలో సోడియం పరిమాణం పెరిగితే, రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బీపీ సమస్యలు ఉన్నవారు అధికంగా ఉప్పు తీసుకుంటే వారి ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఆరోగ్యకరంగా కనిపించే ఆహార పదార్థాలలో కూడా దాగి రహస్యంగా దాగి ఉన్న సోడియం ఉంటుంది. అందువల్ల ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం, లేబుల్‌ను తనిఖీ చేసే అలవాటు ఉండాలి. ఇది బీపీ, గుండె సంబంధిత సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us