Cleaning Tips: చిటికెలో వాటర్ ట్యాప్‌లను ఇలా క్లీన్ చేయవచ్చు.. ఎలాగంటే!

మనం వాడుకోవడానికి నీరు ట్యాప్‌ల ద్వారానే వస్తుంది. వాటర్ ట్యాప్‌లపై అనేక మరకలు పడుతూ ఉంటాయి. నీటి మరకలు, సబ్బు మరకలు, గిన్నెలు కడిగేటప్పుడు ఇలా వాటిపై మరకలు ఉండిపోతాయి. వీటిని వెంటనే క్లీన్ చేయకపోతే.. అవి మరకలుగా అలాగే ఉంటాయి. ఇక వాటిపై దుమ్ము, ధూళి చేరి.. మరింత పేరుకుపోతాయి. ఎప్పుడో గుర్తుకు వచ్చినప్పుడు క్లీన్ చేస్తారు. దీంతో వాటిపై ఉండే మొండి మరకలు..

Cleaning Tips: చిటికెలో వాటర్ ట్యాప్‌లను ఇలా క్లీన్ చేయవచ్చు.. ఎలాగంటే!
Cleaning Tips

Updated on: Jun 20, 2024 | 2:54 PM

మనం వాడుకోవడానికి నీరు ట్యాప్‌ల ద్వారానే వస్తుంది. వాటర్ ట్యాప్‌లపై అనేక మరకలు పడుతూ ఉంటాయి. నీటి మరకలు, సబ్బు మరకలు, గిన్నెలు కడిగేటప్పుడు ఇలా వాటిపై మరకలు ఉండిపోతాయి. వీటిని వెంటనే క్లీన్ చేయకపోతే.. అవి మరకలుగా అలాగే ఉంటాయి. ఇక వాటిపై దుమ్ము, ధూళి చేరి.. మరింత పేరుకుపోతాయి. ఎప్పుడో గుర్తుకు వచ్చినప్పుడు క్లీన్ చేస్తారు. దీంతో వాటిపై ఉండే మొండి మరకలు అంత ఈజీగా పోవు. ఎంతో కష్ట పడాల్సి వస్తుంది. అందులోనూ స్టెయిన్ సెల్ ట్యాప్స్ అయితే తుప్పు పట్టేస్తాయి. మరి ఇలాంటి మొండి మరకలను సైతం ఇప్పుడు చెప్పే చిట్కాలు ఎంతో చక్కగా పోగొడతాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వెనిగర్:

వెనిగర్‌తో మనం ఎన్నో రకాల క్లీనింగ్ చిట్కాలు తెలుసుకున్నాం. ముఖ్యంగా వెనిగర్ కిచెన్‌‌లో ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా వైట్ వెనిగర్, నీటిని కలపండి. ఇందులో ఓ స్పాంజ్‌ వేసి ఓ ఐదు నిమిషాలు అలానే వదిలేయండి. ఆ తర్వాత ఆ స్క్రబర్ లేదా స్పాంజ్‌ తో ట్యా వాటర్ ట్యాప్‌లను బాగా రుద్దండి. ఓ రెండు నిమిషాలు అలానే వదిలేయండి. మొండి మరకలు పోకపోతే.. మళ్లీ రుద్దండి. ఇలా చేయడం వల్ల త్వరగా వాటర్ ట్యాప్స్ క్లీన్ అవుతాయి.

టూత్ పేస్ట్:

టూత్ పేస్ట్‌తో కూడా వాటర్ ట్యాప్‌లను ఈజీగా శుభ్రం చేయవచ్చు. పనికి రాని టూత్ బ్రష్ తీసుకుని దానికి టూత్ పేస్ట్ పెట్టండి. దానితో మురికిగా ఉండే ట్యాప్‌లపై బాగా రుద్దండి. ఆ తర్వాత కడిగేయండి. ఇప్పుడు మీ ట్యాప్స్ తెల్లగా మెరుస్తాయి. టూత్ పేస్టులతో కుళాయిపై ఉండే మరకలు, దుమ్ము, ధూళి పోతాయి.

ఇవి కూడా చదవండి

నిమ్మరసం:

నిమ్మరసంతో కూడా బాత్‌రూమ్, సింక్‌, బయట ఉండే కుళాయిలను శుభ్రం చేసుకోవచ్చు. ఒక గిన్నెలోకి నిమ్మరసం తీసుకోండి. అందులో కొద్దిగా సర్ఫ్ కలిపి మిక్స్ చేయండి. ఈ మిశ్రమంతో ట్యాప్‌లపై స్క్రబర్‌తో రుద్దండి. ఆ తర్వతా కడిగేయండి. ఇలా చేయడం వల్ల మురికి, దుర్వాసన కూడా పోతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us