Green Tea benefits in telugu: గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనే విసయంతెలిసిందే. ఐతే తాజా అధ్యయనాల్లో మరో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. అదేంటంటే.. వరుసగా నాలుగు వారాల పాటు గ్రీన్ టీ తాగితే బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గడమేకాకుండా, కడుపులోని పేగుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వెల్లడయ్యింది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గుముఖం పట్టడంతోపాటు, గుండె జబ్బులకు దారితీసే సమస్యలు కూడా తగ్గినట్లు అధ్యయనాలు తెలిపాయి. మూడింట ఒక వంతు అమెరికన్లలో మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య అధికంగా ఉంటుంది. ఐతే గ్నీన్ టీలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కారకాలు ఈ విధమైన మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడే వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినట్లు అధ్యయనాలు వెల్లడించాయి.
ఓహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన సీనియర్ ప్రొఫెసర్ రిచర్డ్ బ్రూనో ఏంమంటున్నారంటే.. గ్రీన్ టీలోని ఔషధ కారకాలు కొలెస్ట్రాల్, గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్స్‌తో ముడిపడి ఉంటుంది. ఐతే ఏ విధంగా సంబంధం కలిగి ఉంటుందనే విషయాన్ని ఇంతవరకు పరిశోధకులు తెల్పలేకపోయారు. 2019లో దాదాపు 40 మందిపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ విషయాలు బయటపడ్డాయి. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గ్రీన్ టీలోని సప్లిమెంటరీ కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా గణనీయంగా తగ్గించినట్లు మా పరిశోధనల్లో బయటపడిందని రిచర్డ్ బ్రూనో తెలిపారు. బరువు తగ్గాలనుకునే వారు గ్రీన్‌టీ నిరభ్యంతరంగా తాగవచ్చన్నమాట.