
మీరు ఎప్పుడైనా ఓక్రా వాటర్ గురించి విన్నారా.? ఇటీవల ఈ పదం ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తు ప్రచారం జరుగుతోంది. ఓక్రా వాటర్‌తో కలిగే ప్రయోజనాలు అలాంటివి మరి. ఇంతకీ ఓక్రా వాటర్ అంటే ఏంటి.? ఈ వాటర్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఓక్రా వాటర్ అంటే మరెంటో కాదు.. బెండకాయలను నానబెట్టిన నీరు. ఇందుకోసం ముందుగా బెండకాయలను అడ్డంగా ముక్కలు చేసి నీటిలో నానబెట్టాలి. ఇక 8 నుంచి 12 గంటల వరకు నీటిలో నానబెట్టిన తర్వాత నీటిని తాగాలి. రాత్రంతా నానబెట్టి ఉదయం తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఓక్రా వాటర్‌లో రుచి కోసం కాస్త ఉప్పు, మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. ఇంతకీ ఓక్రా వాటర్‌తో లాభాలు ఏంటంటే..
* ఓక్రా వాటర్‌లో విటమిన్-ఏ, విటమిన్-సీ, విటమిన్-కేలతో పాటు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
* ఓక్రా వాటర్‌ను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల పేగుల కదలికలను మెరుగు చేస్తుంది. అరుగుదల సమస్యలు రాకుండా, మలబద్ధకం దరిచేరకుండా కాపాడుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
* ఈ నీటిని క్రమంతప్పకుండా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇన్సులిన్ అదుపులో ఉండని వారు, డయాబెటిస్‌తో బాధపడే వారు ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి.
* గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
* చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఓక్రా వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్-సీ, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడిని నుంచి రక్షించడమే కాక.. హానికరమైన టాక్సిన్ల ఉత్పత్తిని తగ్గించి చర్మాన్ని మరింత అందంగా, ఆరోగ్యంగా మారుస్తుంది.
* శరీరంలో పేరుకుపోయే విష పదార్థాలను తొలగించడంలో బెండకాయ నీరు కీలక పాత్ర పోషిస్తుంది. తరచుగా ఓక్రా నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..