Aloe Vera juice: ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్‌ తాగితే ఎన్ని లాభాలో తెలిస్తే..

జ్యూస్ తాగలేను అనుకునేవారు అందులో కాస్త నిమ్మరసం, తేనెలాంటివి కలుపుకొని తాగవచ్చు. బీపీ, షుగర్ వంటివి తగ్గడానికి అలోవెరా ఉపయోగపడుతుంది. రోజుకు రెండు స్పూన్ల కలబంద జ్యూస్ తాగాలి. స్నానానికి ముందు చర్మానికి కలబందను సబ్బు రాసుకున్నట్టుగా రాసుకోవాలి. ఆ తర్వాత స్నానం చేస్తే చర్మం క్లీన్ అయిపోతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతలో కలబంద దోహదం చేస్తుంది.

Aloe Vera juice: ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్‌ తాగితే ఎన్ని లాభాలో తెలిస్తే..
Aloe Vera

Updated on: Jun 12, 2025 | 9:35 PM

కలబంద ఎన్నో సుగుణాలు ఉన్న ఔషధ మెుక్క. కలబందలోని విటమిన్ B, C, E, ఫోలిక్ యాసిడ్ వంటి అనేక పోషకాలు ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ తాగితే మెరుగైన ఫలితాలు ఉంటాయి. కలబంద రసం మీ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది బాగా పని చేస్తుంది. శరీరంపై ఏర్పడే గాయాలు మాన్పించే గుణాలు కలబందలో ఉన్నాయి. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.

కలబంద గుజ్జు, కొబ్బరి నూనెను కలిపి జుట్టుకు పట్టిస్తే ఎంతో మృధువుగా తయారవుతుంది. తలలో చుండ్రు వదిలిపోతుంది. కలబందలోని పోషకాలు, ఎంజైములు, అమైనో యాసిడ్స్, ఖనిజాలు అధిక బరువును తగ్గిస్తాయి. ప్రతిరోజూ గ్లాస్ నీటిలో 20 శాతం అలోవెరా గుజ్జును కలిపి తాగాలి. ఇది ఎంతో మేలు చేస్తుంది. కడుపులోని కొవ్వు, చెడుపదర్థాలు, పేగులకు అంటుకుపోయే ఆయిల్ వంటివన్నీ క్లీన్ అయిపోతాయి. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటికి పంపించడంలో అలోవెరా జ్యూస్ సాయం చేస్తుంది.

జ్యూస్ తాగలేను అనుకునేవారు అందులో కాస్త నిమ్మరసం, తేనెలాంటివి కలుపుకొని తాగవచ్చు. బీపీ, షుగర్ వంటివి తగ్గడానికి అలోవెరా ఉపయోగపడుతుంది. రోజుకు రెండు స్పూన్ల కలబంద జ్యూస్ తాగాలి. స్నానానికి ముందు చర్మానికి కలబందను సబ్బు రాసుకున్నట్టుగా రాసుకోవాలి. ఆ తర్వాత స్నానం చేస్తే చర్మం క్లీన్ అయిపోతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతలో కలబంద దోహదం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us