“యోగా” జీవితంలో భాగం కావాలి: మంత్రి హరీశ్‌రావు

|

Jun 20, 2020 | 10:19 PM

మాన‌వ మ‌నుగ‌డ‌ను స‌వాల్ చేస్తున్న వ్యాధుల‌ను ఎదిరించే శ‌క్తి ఒక్క యోగాకు మాత్ర‌మే ఉంద‌న్నారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు...

యోగా జీవితంలో భాగం కావాలి: మంత్రి హరీశ్‌రావు
Follow us on

మాన‌వ మ‌నుగ‌డ‌ను స‌వాల్ చేస్తున్న వ్యాధుల‌ను ఎదిరించే శ‌క్తి ఒక్క యోగాకు మాత్ర‌మే ఉంద‌న్నారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు. ఆదివారం అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని  మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌జ‌లంద‌రికీ యోగా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. యోగాతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. యోగా మ‌న జీవితంలో ఒక భాగం కావాల‌ని సూచించారు.

ప్ర‌తీ రోజు సాధ‌న చేయాల‌ని మంత్రి హ‌రీశ్ రావు కోరారు. ఈ రోగాల కల్లోలాలను ఎదుర్కోవడానికి యోగా అద్భుత అవకాశంగా పేర్కొన్నారు. దీనికి ఎలాంటి ఖర్చు ఉండదన్నారు. ‘మిమ్మల్ని అందరినీ యోగా సాధనకు సాదరంగా ఆహ్వానిస్తున్నా.. యోగా చేద్దాం.. ఆరోగ్య తెలంగాణగా మార్చుదాం.’ అని మంత్రి హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలో యోగాను గతేడాది నుంచి అన్నీ వర్గాల ప్రజల్లోకి తీసుకెళ్లామని, పాఠశాలల్లో క్రియాశీలకంగా ప్రవేశపెట్టి సత్ఫలితాలను సాధిస్తున్నామని హరీశ్‌రావు వెల్లడించారు.