
ఉదయం లేవగానే వేడివేడిగా ఒక కప్పు టీ తాగడం చాలామందికి అలవాటే. అయితే ఆరోగ్యపై శ్రద్ధ పెరిగిన నేటి కాలంలో పాలతో చేసిన సాధారణ టీ కంటే గ్రీన్ టీ, బ్లాక్ టీలను ఎంచుకునే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ రెండు టీలలోనూ బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, రెండింటి మధ్య ఉన్న తేడాలేంటి? అనే డౌట్లు చాలా మందికి వస్తాయి. నిజానికి గ్రీన్ టీ, బ్లాక్ టీ రెండింటిలోనూ పాలీఫెనాల్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, వివిధ దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.
గ్రీన్ టీలో కేటెచిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపులను తగ్గించడంలో, జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో గ్రీన్ టీ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి, రక్తంలో చక్కెర నిల్వలను సమతుల్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. జీవక్రియను మెరుగుపరచడం ద్వారా శరీరంలో అనవసర కొవ్వు కరిగించడానికి, బరువును అదుపులో ఉంచడానికి గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుంది.
టీ ఆకులు పూర్తిగా ఆక్సీకరణం చెందినప్పుడు ఈ రకమైన ప్రత్యేక యాంటీఆక్సిడెంట్లు ఏర్పడతాయి. బ్లాక్ టీలోని పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తనాళాల పనితీరును కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది కూడా సహాయపడినప్పటికీ, గ్రీన్ టీతో పోలిస్తే దీని ప్రభావం కాస్త తక్కువగా ఉంటుంది.
గ్రీన్ టీ: నీటిని అతిగా మరిగించకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు టీ ఆకులు లేదా బ్యాగ్‌ను వేసి 2-3 నిమిషాలు మాత్రమే ఉంచాలి. ఎక్కువగా మరిగిస్తే అందులోని పోషకాలు నశిస్తాయి.
బ్లాక్ టీ: వేడి నీటిలో కొద్ది సమయం పాటు నాననివ్వడం ద్వారా మంచి రుచి, సమ్మేళనాలు విడుదలవుతాయి.
పంచదార అస్సలు వద్దు: గ్రీన్ టీ లేదా బ్లాక్ టీలలో పంచదార కలపడం వల్ల వాటిలోని సహజ పోషక విలువలు, బరువు తగ్గే గుణాలు దెబ్బతింటాయి. వీటిని ఎలాంటి చక్కెర లేకుండా తాగడమే ఆరోగ్యకరం.