
ముఖంపై నలుపు మచ్చలు లేదా మంగు మచ్చలు కనిపించినప్పుడు చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బంది పడతారు, రకరకాల రసాయన పూతలు, కెమికల్ కోటింగ్‌లతో వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి, ప్రకృతి వైద్యులు ఒక సులభమైన, సహజమైన చిట్కాను సూచిస్తున్నారు. అది బంగాళాదుంప స్లైస్‌లను ఉపయోగించడం. నలుపు మచ్చలు, మంగు మచ్చలు, బ్లాక్ షేడ్స్‌ను తగ్గించడంలో బంగాళాదుంప స్లైస్‌లు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయట. బంగాళాదుంపను వంటకాల్లో తగ్గించి వాడాలని, లోపలికి అంత మంచిది కాదని చెబుతూనే, బాహ్య సౌందర్యానికి, ముఖ్యంగా మంగు మచ్చలు, బ్లాక్‌హెడ్స్ తగ్గించడానికి బంగాళాదుంపలు బాగా పనిచేస్తాయని వివరించారు.
ఈ చిట్కాను పాటించడానికి, ఒక బంగాళాదుంపను కొంచెం లావుగా స్లైస్‌లుగా కట్ చేసుకోవాలి. మనం చిప్స్ కోసం కట్ చేసే దానికంటే కొంచెం మందంగా ఉండాలి. అలా కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలను ముఖంపై నలుపు వర్ణం ఉన్న భాగాలు లేదా మచ్చలు ఉన్న ప్రాంతాలపై ఉంచి, 10 నుంచి 20 నిమిషాల పాటు సున్నితంగా రుద్దాలి. ఒక వైపు రుద్దడం పూర్తయ్యాక, ఆ ముక్కను తీసి పక్కన పెట్టి, మరొక కొత్త ముక్కను ఉపయోగించవచ్చు. ఒక బంగాళాదుంపను కట్ చేస్తే ఈ ప్రక్రియకు సరిపోతుంది. ఈ విధంగా బంగాళాదుంప స్లైస్‌లతో మసాజ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇది ముఖంపై మచ్చలను నివారించడానికి, ఆ భాగాల్లో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, దెబ్బతిన్న కణాలను నయం చేయడానికి, చర్మానికి దాని సహజమైన రంగును తిరిగి తీసుకురావడానికి తోడ్పడుతుంది.
ఈ చిట్కా చాలామందికి తెలిసినదే అయినప్పటికీ, తెలియని వారు కూడా దీనిని తెలుసుకొని, ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. మచ్చలు సహజంగా పోగొట్టుకొని ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ బంగాళాదుంప చిట్కాను మీరు ట్రై చేయండి.
(ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించాం. మీరు పాటించేముందు తప్పకుండా తెలిసిన స్కిన్ స్పెషలిస్టులను సంప్రదించండి)
మిగతావన్నీ వేస్ట్.. ఈ ఎర్రటి ఎండల్లో దీన్ని కొట్టేది లేదు..