చాలా మంది బొప్పాయి తినడానికి ఇష్టపడతారు. కానీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బొప్పాయి తిన్న తర్వాత మీరు మర్చిపోయి కూడా ఈ పదార్థాలు తినకూడదు. బొప్పాయి తినిన తర్వాత తినకూడని ఆహారాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకం కాల్షియంతో కలిస్తే సమస్యలు వస్తాయి. కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు ఈ పండును తినకూడదు. పులియబెట్టిన బొప్పాయి మీరు బ్లడ్ థిన్నర్లను తీసుకుంటే అది మీకు హానికరం. గుండె జబ్బులతో బాధపడేవారు సాధారణంగా ఈ మందును తీసుకుంటారు.
నారింజ - బొప్పాయి ఈ రెండు వ్యతిరేక పండ్లు. నారింజ లేదా బొప్పాయి ఏదైనా ఒకటి తినాలి. బొప్పాయిలు - నారింజ కలిపి తినడం లేదా ఒకదాని తర్వాత ఒకటి తినడం వల్ల విరేచనాలు, మలబద్ధకం, కడుపు నొప్పి వస్తుంది.
Papaya -బొప్పాయి కూడా కంటికి మేలు చేస్తుంది. ఇందులో లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్ వంటి కీలక పోషకాలు లభిస్తాయి.. ఇవి సహజమైన సన్‌బ్లాక్‌గా పనిచేస్తాయి. ఇది రెటీనాలోకి వచ్చే అదనపు కాంతిని గ్రహించడంలో సహాయపడుతుంది. బ్లూ లైట్ నుండి కంటిని రక్షించడంలో కూడా ఇవి సహాయపడతాయి.
బొప్పాయిలో కేలరీలు తక్కువగా పోషకాలు అధికంగా ఉంటాయి. బొప్పాయి తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు దరి చేరవు. బొప్పాయిలో ఫైబర్, కెరోటిన్, విటమిన్ సి, ఈ, ఎ అనేక ఇతర ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణసమస్యలు కూడా దరి చేరకుండా ఉంటాయి. కానీ కొన్ని వ్యాధులు ఉన్నవారు బొప్పాయి తినకూడదు.