Bitter Gourd Juice: కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది అందుకే దీనిని తినడానికి చాలామంది ఇష్టపడరు. అయితే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారకి ఇది దివ్య ఔషధం. ప్రతిరోజు పరగడుపున కాకర్ జ్యూస్ తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాకర రసానికి కొవ్వును కరిగించే శక్తి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. కాకర రసాన్ని మరింత రుచికరంగా చేయడానికి ఇందులో చాలా పదార్థాలు కలుపుకొని తాగవచ్చు. ఇందులో ఫోలేట్, జింక్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి 1, బి 2, బి 3 వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
కాకర జ్యూస్‌తో బరువు ఎలా తగ్గవచ్చు..
1. కాకరకాయ జ్యూస్ ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీంతో శరీరం తక్కువ కొవ్వును ఉత్పత్తి చేస్తుంది. తద్వారా మీరు బరువు పెరగడానికి అవకాశం ఉండదు.
2. కాకరకాయలో చాలా తక్కువ కేలరీలు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కాకరకాయకి శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరిగించే శక్తి ఉంటుంది. 100 గ్రాముల కాకరలో కేవలం 34 కేలరీలు మాత్రమే ఉంటాయి. బరువు తగ్గడానికి డైట్‌లో కచ్చితంగా కాకర ఉండాల్సిందే.
3. కాకరకాయలో మీ శరీరానికి మేలు చేసే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల కడుపునిండిన భావం కలుగుతుంది. తద్వారా ఎక్కువగా ఆహారం తినడం మానేస్తాం. దీంతో బరువు అదుపులో ఉంటుంది.
4. కాకరకాయ కొవ్వు పెరుగుదలను నిరోధిస్తుంది. ప్రతిరోజు కాకర జ్యూస్ తాగడం వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండదు. డయాబెటీస్ అదుపులో ఉంటుంది. అధికంగా బరువు పెరగడాన్ని నియంత్రిస్తుంది.