AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? అస్సలు ఊహించలేరు..

మలబద్ధకం నుంచి విముక్తి పొందాలంటే కివీ పండే మేలని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం రెండు కివీ పండ్లు తీసుకుంటే కడుపు క్లీన్ అవ్వడమే కాదు.. మీ రోగనిరోధక శక్తి కూడా బుల్లెట్ వేగంతో పెరుగుతుంది. అసలు కివీ పండు గురించి వైద్య నిపుణులు చెబుతున్న ఆశ్చర్యకరమైన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? అస్సలు ఊహించలేరు..
Kiwi Fruit Health Benefits
Krishna S
|

Updated on: Apr 08, 2026 | 1:38 PM

Share

నేటి ఉరుకుల పరుగుల జీవితం, మారిన ఆహారపు అలవాట్ల వల్ల మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు ఇంటింటికీ సాధారణమైపోయాయి. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి చాలామంది రకరకాల మందులు వాడుతుంటారు. అయితే వీటన్నింటికంటే ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తినడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని తాజా వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సుమారు 184 మందిపై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరిశోధకులు వీరిని రెండు బృందాలుగా విభజించి, ఒక బృందానికి ప్రతిరోజూ రెండు కివీ పండ్లు, మరో బృందానికి ఇసబ్గోల్ లేదా సైలియం పొట్టు ఇచ్చారు. నాలుగు వారాల తర్వాత చూస్తే.. కివీ పండ్లు తిన్నవారిలో జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, కడుపునొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు.

జీర్ణ వ్యవస్థకు సంజీవని

కివీ పండులో ఉండే యాక్టినిడిన్ అనే ఎంజైమ్, అధిక ఫైబర్ కంటెంట్ ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే కరిగే ప్రీబయోటిక్ ఫైబర్ ప్రేగులలోని మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడి, కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది.

రోగనిరోధక శక్తికి కేరాఫ్ అడ్రస్

కేవలం జీర్ణక్రియకే కాదు, కివీ పండు రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా మేటి. కివీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జలుబు, దగ్గు వంటి అంటువ్యాధుల నుండి రక్షణ ఇస్తుంది. రోజూ రెండు గోల్డెన్ కివీ పండ్లు తినే వృద్ధులలో గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు తక్కువగా ఉంటాయని, ఒకవేళ అనారోగ్యం సోకినా వారు చాలా వేగంగా కోలుకుంటారని అధ్యయనం తేల్చింది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

బరువు నియంత్రణ: తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

కంటి చూపు: కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ల్యూటిన్, జీక్సాంథిన్ వంటి మూలకాలు కివీలో ఉన్నాయి.

చర్మ సౌందర్యం: యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి.

జాగ్రత్తలు తప్పనిసరి

కివీలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నా, కొందరికి ఇది అలెర్జీని కలిగించవచ్చు. నోరు వాపు లేదా దురద వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మొదట్లో తక్కువ పరిమాణంలో తింటూ మీ శరీరానికి ఇది పడుతుందో లేదో చూసుకోవడం మంచిది.

Follow Us
సెల్ఫీ పేరిట.. ఏడాది కూతురిని యమునా నదిలోకి విసిరేసిన తండ్రి!
సెల్ఫీ పేరిట.. ఏడాది కూతురిని యమునా నదిలోకి విసిరేసిన తండ్రి!
మందులకు గుడ్ బై చెప్పి వీటిని ఉడికించి తింటే షుగర్ పక్కా కంట్రోల్
మందులకు గుడ్ బై చెప్పి వీటిని ఉడికించి తింటే షుగర్ పక్కా కంట్రోల్
ఆగస్ట్ 15 నాడు సెంచరీ కొట్టిన తొలి భారతీయుడు పడిక్కల్ కాదా?
ఆగస్ట్ 15 నాడు సెంచరీ కొట్టిన తొలి భారతీయుడు పడిక్కల్ కాదా?
అటు అగ్నిపర్వతం బద్దలు.. ఇటు 235 సార్లు భూకంపం..
అటు అగ్నిపర్వతం బద్దలు.. ఇటు 235 సార్లు భూకంపం..
శ్రావణ వరలక్ష్మీ పూజ: లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద రహస్యం ఇదే
శ్రావణ వరలక్ష్మీ పూజ: లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద రహస్యం ఇదే
ఏపీలో మరో మూడు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ జిల్లాల్లోనే..
ఏపీలో మరో మూడు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ జిల్లాల్లోనే..
పాత బావుల్లోకి దిగితే ఎందుకు చనిపోతారు? విష వాయువులు ఎలా వస్తాయ్
పాత బావుల్లోకి దిగితే ఎందుకు చనిపోతారు? విష వాయువులు ఎలా వస్తాయ్
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల
ఈ రాశుల వారికి పండుగే పండుగ.. తిరుగులేని రాజయోగం
ఈ రాశుల వారికి పండుగే పండుగ.. తిరుగులేని రాజయోగం
సినిమాలు మానేసి వ్యాపారం చేసుకోమ్మన్నారు.. కట్ చేస్తే 350కుపైగా
సినిమాలు మానేసి వ్యాపారం చేసుకోమ్మన్నారు.. కట్ చేస్తే 350కుపైగా