Pulagam Recipe: వరలక్ష్మి వ్రతం స్పెషల్.. కొత్తబియ్యంతో పులగం తయారీ విధానం..

|

Aug 19, 2021 | 2:13 PM

Varalakshmi Vratam Pulagam Recipe: శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. మహిళలకు ఎంతో సంతోషం. పండగలు, వ్రతాలు, పంక్షన్లు వీటితో ఆడవారు ఎంతో బిజీబిజీగా గడుపుతారు. మరి ఆ శ్రావణ..

Pulagam Recipe: వరలక్ష్మి వ్రతం స్పెషల్.. కొత్తబియ్యంతో పులగం తయారీ విధానం..
Pulagam
Follow us on

Varalakshmi Vratam Pulagam Recipe: శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. మహిళలకు ఎంతో సంతోషం. పండగలు, వ్రతాలు, పంక్షన్లు వీటితో ఆడవారు ఎంతో బిజీబిజీగా గడుపుతారు. మరి ఆ శ్రావణ శోభకు వరలక్ష్మీ వ్రతం నిండుదనం తెస్తుంది. శ్రావణ మాసం రెండో శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం కోరుతూ మహిళలు వ్రతాలు ఆచరిస్తారు. యధాశక్తిని లక్ష్మీదేవిని పూజించి తమని ఆశీర్వదించమని కోరుతూ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. మరి శ్రావణ శుక్రవారం రోజున కొత్తబియ్యంతో చూడగానే తినాలనిపించే పులగాన్ని తయారు చేసి.. అమ్మవారికి నైవేధ్యంగా పెడతారు. ఈ రోజు పులగం తయారీ గురించి తెలుసుకుందాం..

పులగం తయారీకి కావాల్సిన పదార్ధాలు:

కొత్త బియ్యం- కప్పు,
పెసరపప్పు- అర కప్పు,
నెయ్యి
కరివేపాకు
మిరియాలు
జీలకర్ర
ఉప్పు- రుచికి సరిపడా
జీడిపప్పు,
బాదం పప్పు

తయారీ విధానం:

బియ్యం, పెసరపప్పును కలిపి నీళ్లు పోసి అరగంట నానబెట్టుకోవాలి. పొయ్యి మీద మందమైన అడుగున్న గిన్నె పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడి ఎక్కిన తర్వాత మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత ఆ పోపులో ఒక కప్పుకి మూడు కప్పుల నీరు పోసి మరిగించాలి. తర్వాత ఆ వేడి నీటిలో నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి. అన్నం మెత్తగా ఉడికిన తర్వాత మరికొంచెం నెయ్యి వేసుకుని నేతిలో వేయించిన జీడిపప్పు, బాదాం ని వేసుకుని దింపేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పులగం రెడీ

Also Read: అమ్మవారికి నైవేధ్యంగా ఆంధ్రా స్టైల్‌లో తియ్యతియ్యటి పూర్ణం బూరెలు.. తయారీవిధానం