నేచర్ డాక్టర్.. యాపిల్ పండు గురించి మీకు తెలియని నిజాలు..

యాపిల్‌లో ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు వంటి పలు పోషకాలు ఉంటాయి. యాపిల్‌ను సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం వంటి అంశాలకు మద్దతు ఇవ్వవచ్చు. యాపిల్‌లోని పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు, రోజువారీ ఆహారంలో చేర్చుకునే విధానం గురించి తెలుసుకోండి.

నేచర్ డాక్టర్.. యాపిల్ పండు గురించి మీకు తెలియని నిజాలు..
Apple Health Benefits

Updated on: Sep 02, 2026 | 1:32 PM

ఏ పండుకు లేని విశిష్టత యాపిల్ పండుకు ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. రంగులోనూ, ఆకారంలోనూ అందరినీ ఆకట్టుకునే ఈ పండు, ఆరోగ్యాన్ని అందించడంలోనూ అగ్రస్థానంలో నిలుస్తుంది. “రోజుకు ఒక యాపిల్ తింటే వైద్యుడికి దూరంగా ఉండవచ్చు” అనే పెద్దలు చెప్పే సామెత దీని ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది. యాపిల్ పండ్లు సాధారణంగా ఎరుపు, పసుపు పచ్చ, ఆకుపచ్చ, గులాబీ రంగులలో లభిస్తాయి. ఒక సాదారణ ఆపిల్‌లో సుమారు 95 క్యాలరీలు, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4 గ్రాముల ఫైబర్ (పీచు పదార్థం) ఉంటాయి. దీంతోపాటు.. విటమిన్లు విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి..

ఎన్నో ప్రయోజనాలు..

ఆహారంతో పాటు యాపిల్ పండును తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది శరీరంలోని ఆమ్లత్వాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా యాపిల్స్ తీసుకునే వారిలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం గణనీయంగా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. యాపిల్ పండ్లు వివిధ రకాల తలనొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా యాపిల్, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని.. కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరానికి తగినంత తేమను కూడా అందిస్తుంది.

ముఖ్యంగా, బాగా పండిన యాపిల్ పండును తీసుకుని, దాని పైపొరను, మధ్యలోని గట్టి భాగాన్ని తొలగించి, కొద్దిగా ఉప్పు చేర్చి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తింటే రక్తహీనత వల్ల ఏర్పడిన తలనొప్పులు తగ్గుతాయి. ఆశించిన ఫలితాల కోసం దీనిని కనీసం రెండు నుండి మూడు వారాల పాటు తీసుకోవడం అవసరమని డైటీషియన్లు చెబుతున్నారు.

యాపిల్ పండు ఆరోగ్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు తగ్గిపోతాయి. చంటి పిల్లలకు బాగా పండిన యాపిల్‌ను తినిపించడం ద్వారా వారు ఆరోగ్యవంతంగా పెరుగుతారు. సమగ్ర పోషక విలువలతో కూడిన యాపిల్ పండును మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us