Mango: సహజంగా పండిన మామిడిని ఎలా గుర్తించాలో తెలుసా? రసాయనాలకు ఇలా దూరంగా ఉండండి.

|

Mar 30, 2023 | 4:26 PM

వేసవి వస్తుందంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది మామిడి పండ్లు. వేసవిలో ఎండలు దంచి కొడతాయి, ఉక్కపోత ఓ రేంజ్‌లో ఉంటుందనే భయం ఉన్నా మామిడి పండ్లు వస్తాయనే ఒక సంతోషం కూడా ఉంటుంది. ఈ పండు రుచి అలాంటిది మరి. కేవలం సమ్మర్‌లోనే..

Mango: సహజంగా పండిన మామిడిని ఎలా గుర్తించాలో తెలుసా? రసాయనాలకు ఇలా దూరంగా ఉండండి.
Mangoes
Follow us on

వేసవి వస్తుందంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది మామిడి పండ్లు. వేసవిలో ఎండలు దంచి కొడతాయి, ఉక్కపోత ఓ రేంజ్‌లో ఉంటుందనే భయం ఉన్నా మామిడి పండ్లు వస్తాయనే ఒక సంతోషం కూడా ఉంటుంది. ఈ పండు రుచి అలాంటిది మరి. కేవలం సమ్మర్‌లోనే లభించే ఈ పండు కోసం ఎదురు చూస్తుంటారు. ఇక అంతా కమర్షియల్‌గా మారిపోతున్న రోజుల్లో మామిడి పండ్లను కూడా కమర్షియల్‌గా మార్చేశారు కొందరు. త్వరగా పండ్లు కావాలనే ఉద్దేశంతో రసాయనాలతో మామిడిని పండిస్తున్నారు. దీంతో చెట్లపై పండ్లుగా మారాల్సిన మామిడి కెమికల్స్‌తో పక్వానికి వస్తున్నాయి.

ఇలా కెమికల్స్‌తో పండించిన పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ మార్కెట్లో కనిపించే మామిడి పండ్లు సహజంగా పండినవా.? లేదా కెమికల్స్‌తో పండించినవా.? ఎలా తెలుసుకోవాలో చాలా మందికి తెలియక తికమకపడుతుంటారు. అయితే కొన్ని సింపుల్‌ టెక్నిక్స్‌ ద్వారా మామిడి పండ్లు సహజంగా పండిన పండా.. లేక కృత్రిమంగా పండిన పండా తెలుసుకోవచ్చు. ఆ తేడాలు ఏంటంటే..

సహజంగా పండిన మామిడిపండ్ల కంటే కార్బైడ్‌తో పండిన పండ్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కెమెమికల్స్‌తో పండించిన పండ్లలో అక్కడక్క పచ్చగా మచ్చలు ఉంటాయి. సహజంగా పండిన మామిడిపండ్లలో గుజ్జు, రసం ఎక్కువగా ఉంటుంది. వాటిని తినడానికి కట్ చేసినప్పుడు ఎరుపు, పసుపు కలిసిన ప్రకాశవంతమైన రంగులో మామిడి గుజ్జు కనిపిస్తుంది. కృత్రిమంగా పండిన మామిడి గుజ్జు లేత, ముదురు పసుపు రంగులో ఉంటుంది. అలాగే ఈ పండ్లు తీపి తక్కువగా ఉంటాయి. అలాగే పండు వాసనను గమనిస్తే నేచురల్‌గా పండిన దానికి కెమికల్స్‌తో పండిన దానికి స్పష్టమైన తేడా ఉంటుంది. ఇలాంటి కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పండ్లు సహజంగా పెరిగినవా.? కెమెకల్స్‌తో పెరిగినవా.? గుర్తించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఫుడ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..