చలికాలంలో కరకరలాడే మసాల శనగలు తినింటే ఆ.. మజానే వేరుగా ఉంటుంది. అయితే వీటిని తెల్ల శనగలు, చోలే, పంజాబీ శనగలు అని కూడా అంటారు. తెల్ల శనగలను ఆహారంగా తీసుకోవటం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. అత్యధికంగా ప్రోటీన్లను కలిగి ఉన్న వృక్ష సంబంధమైన ఆహారాల్లో ఈ శనగలు ఒకటి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతోపాటు బరువును తగ్గించడంలోనూ ఇవి సహాయపడతాయి. ఫోలిక్ యాసిడ్, ఫైబర్, మెగ్నిషియం, జింక్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ వంటి పోషకాలు వీటిలో అత్యధికంగా ఉంటాయి. మీరు త్వరగా బరువు తగ్గాలని కోరుకుంటే కానీ చప్పగా లేదా రుచిలేని ఆహారాన్ని తినకూడదు. మీరు ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహారం కోసం చూస్తున్నట్లయితే.. ఈ వంటకం మీ కోసమే.. ఈరోజు మేము మీతో టేస్టీగా, తక్కువ క్యాలరీలతో కూడిన స్పైసీ రిసిపిని షేర్ చేసుకుంటున్నాం.
మీరు ఇంట్లో ఉంచుకున్న పంజాబీ శనగలతో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇది ఎంత రుచికరమైనదో అంతకంటే ఎక్కవ ఆరోగ్యకరమైనది. అది మరింత క్రంచీగా, క్రిస్పీగా ఉంటుందో మీరు చేసిన తర్వాత చూడవచ్చు. మీరు అల్పాహారంలో తినగలిగే జీరో ఆయిల్ క్రంచీ, క్రిస్పీ స్నాక్స్ అని చెప్పవచ్చు. ఈ శనగలతో చేసిన ఈ స్పైసీ రిసిపిలో చుక్క నూనె కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు. కాబట్టి జీరో ఆయిల్ మసాలా శనగలు రిసిపిని ఎలా చేయాలో తెలుసుకుందాం.
రోగ నిరోధక శక్తిని, జీర్ణ శక్తిని, ఎముకల ధృడత్వాన్ని పెంచడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. బీపీని, హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్న తెల్ల శనగలను ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటితో మనం రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. వీటితో చేసే వంటకాలల్లో చోలే మసాలా కూర ఒకటి.
మరిన్ని ఆహార వార్తల కోసం