ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. కేలరీలు ఎక్కువగా ఉన్న ఫుడ్ తినడం.. జంక్ ఫుడ్, వ్యాయమాలు చేయకపోవడం.. ఇలా ఎన్నో రకాల కారణాలతో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా.. అధిక బరువు, ఉబకాయం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక బరువు తగ్గేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం భోజనం చేయకుండా ఉండడం.. డాక్టర్స్ చుట్టూ తిరగడం వంటివి చేసి అలసిపోతుంటారు. అయితే మీరు రోజు తీసుకునే ఆహారపదార్థాలతో మరిన్ని ఫుడ్ ఐటమ్స్ కలిపి తీసుకోవడం వలన సులభంగా బరువు తగ్గోచ్చు. అవెంటో తెలుసుకుందాం.
అన్నం.. పప్పులు..
ఇంట్లో చేసే.. పప్పు చారు, రాజ్మా చావల్ తినడం వలన సులభంగా బరువు తగ్గోచ్చు. పప్పు, కాయ ధాన్యాలలో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. అన్నంతోపాటు.. పప్పుతో చేసిన వంటలను జతచేసి తింటే.. కార్బ్ మూలం ఎక్కువగా అందితుంది. క్వినోవా కూడా జతచేసుకోవచ్చు.
వోట్మీల్..
బరువు తగ్గడానికి వోట్మీల్ ఎక్కువగా సహాయపడుతుంది. బాదం, వాల్నట్, చియా విత్తనాలలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పండ్లు, పెరుగు కలుపుకోని తిన్నా కూడా ఫలితం ఉంటుంది.
గ్రీన్ టీ నిమ్మరసం..
చాలా మంది బరువు తగ్గేందుకు గ్రీన్ టీ ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇందులో డిటాక్సిఫైయర్, తక్కువ కేలరీలు ఉంటాయి. రోజూకు 3 -4 కప్పుల గ్రీన్ టీ తాగడం వలన రక్తపోటును నియంత్రించవచ్చు. అయితే గ్రీన్ టీకి నిమ్మరసం కలుపుకొని తాగడం వలన సులభంగా బరువు తగ్గోచ్చు.
పన్నీర్, కూరగాయలు..
రోజూ తాజా కూరగాయలతో పన్నీర్ కలిపి చేసిన వంటలను తినడం వలన బరువు తగ్గుతారు. అలాగే ఇందులో పైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి.
దాల్చిన చెక్క, టీ..
బరువు తగ్గేందుకు ప్రయత్నించేవారికి కాఫీ మంచిది. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. దాల్చిన చెక్కతోపాటు మసాలను కూడా కలిపి తీసుకోవడం మంచిది. ఇందులో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ ఉండడం వలన మంట, ఉబకాయం, బరువు పెరగడాన్ని తగ్గిస్తాయి.
బంగాళాదుంపలు, మిరియాల పొడి..
బంగాళాదుంపలను ఉడికించి.. వాటికి మిరియాల పొడిని కలపడం వలన బరువు తగ్గోచ్చు. అయితే బంగాళాదుంపలను వీడిగా తీసుకోవడం వలన లావుగా మారతారు. బంగాళాదుంపలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే మిరియాల పొడి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
Also Read: Healthy Food: రోగ నిరోధక శక్తిని పెంచే మొలకెత్తిన విత్తనాల సూప్.. ఎలా తయారు చేయాలంటే..