Diabetes: మధుమేహం ఉన్నవారు పరగడుపున ఖాళీ పొట్టతో తినాల్సిన సూపర్ ఫుడ్స్‌ ఇవి..!

|

Nov 13, 2023 | 7:11 AM

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో నెమ్మదిగా విడుదల చేసే ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. మీరు తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ వల్ల షుగర్ స్థాయిలను అధికంగా చేసే ఫుడ్ ను తింటే రోజంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మధుమేహం ఉన్నవారిలో ఉదయానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మన కాలేయం అదనపు గ్లూకోజ్‌ని ఉత్పత్తి చేస్తుంది. మీకు దాహంగా అనిపించినా, అతిగా మూత్ర విసర్జన చేసినా, ఉదయాన్నే..

Diabetes: మధుమేహం ఉన్నవారు పరగడుపున ఖాళీ పొట్టతో తినాల్సిన సూపర్ ఫుడ్స్‌ ఇవి..!
Diabetes
Follow us on

తరచుగా మనం ఉదయం పూట అల్పాహారం కోసం ఏం తీసుకోవాలో తెలియక తికమకపడుతుంటాము. ఇలాంటి పరిస్థితుల్లో సగం సమయం ఆలోచనలోనే గడిచిపోయి హడావుడిగా ప్రత్యేకంగా ఏదీ తయారు చేసుకోలేకపోతుంటాం..కానీ, రోజంతా శరీరం ఉత్తేజంగా ఉండి, ఉత్సహంగా పని చేయాలంటే పరగడుపున తినే ఆహారం బ్రేక్‌ ఫాస్ట్‌ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు బ్రేక్‌ఫాస్ట్‌ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వారు కడుపునిండా తినడమే కాకుండా..రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో నెమ్మదిగా విడుదల చేసే ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. మీరు తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ వల్ల షుగర్ స్థాయిలను అధికంగా చేసే ఫుడ్ ను తింటే రోజంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మధుమేహం ఉన్నవారిలో ఉదయానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మన కాలేయం అదనపు గ్లూకోజ్‌ని ఉత్పత్తి చేస్తుంది. మీకు దాహంగా అనిపించినా, అతిగా మూత్ర విసర్జన చేసినా, ఉదయాన్నే చూపు మందగించినట్టు అనిపించినా… మీ రక్తంలో షుగర్‌ లెవల్స్‌ ఎక్కువైనట్టు లెక్క. కాబట్టి ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు పరగడుపునే తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే.

మధుమేహం బాధితులు మార్నింగ్‌ ఖాళీ కడుపుతో ఒక స్పూను ఆవు నెయ్యిలో చిటికెడు పసుపు కలుపుకునే తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఆ రోజంతా మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా కాపాడుతుంది. అలాగే తీపి పదార్థాలు తినాలన్న కోరికలను కూడా నియంత్రిస్తుంది. నెయ్యి పొట్ట నిండిన భావనను పెంచుతుంది. పసుపు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

వంటింట్లో ఉండే మసాలా దినుసు దాల్చిన చెక్క వల్ల మధుమేహలుకు ఎంతో ఉపయోగం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు దోహదం చేస్తుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహించడానికి రోజంతా సహాయపడుతుంది. దాల్చిన చెక్కతో తయారు చేసుకున్న టీ పరగడుపునే తాగితే మంచిది.

ఉదయాన్నే ఒక స్పూన్ ఉసిరి రసం తాగితే చాలా మంచిది. లేదంటే ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సిడర్ వెనిగర్ తాగిన కూడా మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ రెండు అందుబాటులో లేకుంటే.. గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి పరగడుపున తాగినా కూడా ఉత్తమం అంటున్నారు. ఈ ద్రావకాలు శరీరంపై ఆల్కలైజింగ్ ప్రభావాన్ని కలిగిస్తాయి.

మెంతి నీరు మధుమేహలకు నిజంగానే సూపర్ ఫుడ్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పరగడుపునే మెంతి నీరు తాగినట్టయితే శరీరం కార్బోహైడ్రేట్లను శోషించుకోకుండా కాపాడుతుంది. ఒక టీ స్పూన్ మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం లేచాక ఆ నీటిని తాగేయాలి. ఆ గింజలను కూడా నమిలి మింగేయాలి. ఇలా నెల రోజులు చేస్తే చాలు మీ బ్లడ్‌ షుగర్‌ పూర్తిగా అదుపులోకి వచ్చేస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినా, తగ్గినా కూడా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది..కాబట్టి మీ బ్లడ్‌ షుగర్‌లో హెచ్చుతగ్గులు కాకుండా అదుపులో ఉండేలా చూసుకోవటం అత్యవసరం. ఇందుకోసం ప్రోటీన్ నిండిన ఆహారాన్ని పరగడుపున తినాలి. రాత్రి నానబెట్టిన బాదం పప్పును, ఉదయం తినాలి. వీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో కాఫీ, టీలు తాగటం మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..