Free Sandwiches: అబ్బ.. నోరూరించే ఆఫర్‌! ఈ రెస్టారెంట్‌లో జీవితకాలం శాండ్‌విచ్‌ ఫ్రీ.. ఫ్రీ..

ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చింది. ఒక్క రూపాయి చెల్లించకుండా జీవితకాలం శాండ్‌ విచ్‌ ఫ్రీగా ఇస్తామంటూ కస్టమర్లకు నోరూరించే ఆఫర్‌ ఇచ్చింది. ఏంటీ.. ఇది నమ్మలేక పోతున్నాం. ఎక్కడుంది..? అని వెతికేస్తున్నారా. కానీ అందుకు ఓ చిన్న మెలిక ఉంది.. అమెరికాలోని సబ్‌వే రెస్టారెంట్‌ ఈ విచిత్ర ఆఫర్‌ ప్రకటించింది. అందుకు ఓ పోటీలో నెగ్గవల్సి ఉంటుంది. ఈ పోటీ ఆగస్టు 1 నుంచి 4వ తేదీ మధ్య మాత్రమే జరుగుతుంది...

Free Sandwiches: అబ్బ.. నోరూరించే ఆఫర్‌! ఈ రెస్టారెంట్‌లో జీవితకాలం శాండ్‌విచ్‌ ఫ్రీ.. ఫ్రీ..
Sandwich

Updated on: Jul 31, 2023 | 4:10 PM

ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చింది. ఒక్క రూపాయి చెల్లించకుండా జీవితకాలం శాండ్‌ విచ్‌ ఫ్రీగా ఇస్తామంటూ కస్టమర్లకు నోరూరించే ఆఫర్‌ ఇచ్చింది. ఏంటీ.. ఇది నమ్మలేక పోతున్నాం. ఎక్కడుంది..? అని వెతికేస్తున్నారా. కానీ అందుకు ఓ చిన్న మెలిక ఉంది.. అమెరికాలోని సబ్‌వే రెస్టారెంట్‌ ఈ విచిత్ర ఆఫర్‌ ప్రకటించింది. అందుకు ఓ పోటీలో నెగ్గవల్సి ఉంటుంది. ఈ పోటీ ఆగస్టు 1 నుంచి 4వ తేదీ మధ్య మాత్రమే జరుగుతుంది. దీనిలో నెగ్గిన వారికి జీవితాంతం శాండ్‌విచ్‌ ఫ్రీ.. ఫ్రీ.. అంటూ బిగ్‌ ఆఫర్‌ అనౌన్స్ చేసింది. అందుకు ముందుగా సబ్‌వే రెస్టారెంట్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ పేర్లను నమోదు చేసుకోవల్సి ఉంటుంది. వారందరిలో సబ్‌వే ఒకరిని ఎంపిక చేసి లైఫ్‌లాంగ్‌ శాండ్‌విచ్‌ ఉచితంగా ఇవ్వనుంది. ఇంతకీ పోటీ ఏమిటంటే..

ఈ కాంపిటీషన్‌లో పేరు నమోదు చేసుకున్న వారు చట్టబద్దంగా తమ పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. అలా పేరు మార్చుకోవడానికి అవసరమైన అన్ని లీగల్‌ ప్రాసెసింగ్‌ ఖర్చులను సబ్‌వే రెస్టారెంటే భరిస్తుంది. ఈ ఆఫర్‌ కేవలం శాండ్‌విచ్‌ ప్రేమికుల కోసమేనట. సబ్‌వే ఇలాంటి ప్రత్యేకమైన ఆఫర్‌తో ముందుకు రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది కూడా ఈ ఉచిత శాండ్‌విచ్‌ల ఆఫర్‌ ఏడాది పొడవునా ప్రకటించింది. తామిచ్చిన కొలతల్లో పోటీలో పాల్గొనే వారు తమ పేరును శరీరంపై టాటూ వేయించుకోవాలన్నది గతేడాది కాన్సెఫ్ట్. అలా సరైన పరిమాణం, కొలతలతో టాటూ వేయించుకున్న వారికి నగదు బహుమతి ఇచ్చింది. కాగా సబ్‌వే రెస్టారెంట్‌ ప్రపంచ వ్యాప్తంగా 37 వేల బ్రాంచుల్లో వందకు పైగా దేశాల్లో సక్సెస్‌ ఫుల్‌గా వ్యాపారం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us