Protein Foods: మగాళ్లూ జాగ్రత్త.. నాన్-వెజ్ బాగా లాగిస్తున్నారా.? అయితే ఆ సామర్ధ్యం తగ్గుతున్నట్లే.!

|

Apr 02, 2022 | 12:16 PM

చికెన్, మటన్, గుడ్లు ఎక్కువగా లాగిస్తున్నారా.? అయితే మీకో బ్యాడ్‌న్యూస్. ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయని మాంసాహారం మోతాదుకు మించి...

Protein Foods: మగాళ్లూ జాగ్రత్త.. నాన్-వెజ్ బాగా లాగిస్తున్నారా.? అయితే ఆ సామర్ధ్యం తగ్గుతున్నట్లే.!
Chicken
Follow us on

చికెన్, మటన్, గుడ్లు ఎక్కువగా లాగిస్తున్నారా.? అయితే మీకో బ్యాడ్‌న్యూస్. ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయని మాంసాహారం మోతాదుకు మించి తింటే ప్రమాదకరమని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లల కోసం ప్లాన్ చేస్తోన్న పురుషులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలని హెచ్చరిస్తున్నారు. శరీరానికి కావాల్సిన ప్రోటీన్ల శాతం ఎక్కువైతే.. పురుషులలో సంతానోత్పత్తి తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. తాజాగా చేసిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

యూనివర్సిటీ ఆఫ్ వోర్సెస్టర్‌కు చెందిన పరిశోధకులు తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో ప్రోటీన్ ఫుడ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ప్రోటీన్లు అధికంగా ఉండే ఫుడ్స్.. పురుషులలోని టెస్టోస్టెరాన్ హార్మోన్‌పై ప్రభావం చూపిస్తాయని తేలింది. అంతేకాదు టెస్టోస్టెరాన్ లెవెల్స్‌ను 37 శాతం తగ్గిస్తాయని కనుగొన్నారు. దీనిని హైపోగోనాడిజం అని పిలుస్తారని చెప్పిన పరిశోధకులు.. ఒకవేళ ఈ సమస్య గానీ ఏర్పడితే.. వీర్యంలోని శుక్రకణాల కౌంట్ తగ్గుతుందని.. ఫలితంగా పురుషులలో సంతానోత్పత్తి తగ్గిపోతుందని ప్రధాన పరిశోధకుడు, పోషకాహార నిపుణుడు జో విట్టేకర్ అన్నారు. అలాగే తక్కువ టెస్టోస్టెరాన్.. గుండె జబ్బులు, డయాబెటిస్, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయొచ్చునని చెప్పారు.

కాగా, ఈ మధ్య సిక్స్ పాక్, బాడీ ఫిట్‌గా ఉంచుకునేందుకు పురుషులు ప్రోటీన్ షేక్స్‌ను మోతాదుకు మించి తాగుతున్నారు. వాటిని ఎక్కువగా తీసుకుంటే లేనిపోని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని చెబుతున్నారు. ప్రోటీన్ల మోతాదు మించితే.. కడుపు నొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కనీసం రెండు వారాలకు 35 శాతం కంటే ఎక్కువ ప్రోటీన్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని జో విట్టేకర్ స్పష్టం చేశారు.

గమనిక: ఈ వార్తలో అందించిన సమాచారం అధ్యయనాలు, నిపుణులు పేర్కొన్న వివరాలు మాత్రమే. కేవలం అవగాహన కోసమే. ఏదైనా డైట్ తీసుకునే విషయంలో మీరు కచ్చితంగా వైద్యులు సలహా పాటించాలి.