10 రోజులకు ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం ఉక్కులా బలంగా మారిపోయిద్ది..

మేక లేదా గొర్రె బోటీతో చేసే కూరలో ప్రోటీన్, ఐరన్, విటమిన్‌ బి12 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడతాయి. అయితే బోటీని పూర్తిగా శుభ్రం చేసి, బాగా ఉడికించి, మితంగా తీసుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

10 రోజులకు ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం ఉక్కులా బలంగా మారిపోయిద్ది..
Mutton Boti Curry Benefits

Updated on: Sep 29, 2026 | 12:40 PM

ఆదివారం అనే కాకుండా.. ఏదైనా ప్రత్యేక సందర్భంలో లేదా తినాలనుకున్నప్పుడు.. చాలామంది నాన్-వెజ్ వంటకాలను ఇష్టపడతారు. వీటిలో మేక మాంసానికి ప్రత్యేక స్థానం ఉంది. మేకలోని అన్ని భాగాలను, ముఖ్యంగా బోటి, తలకాయ, రక్తం, కాళ్లు వంటివి ఆహారంగా తీసుకుంటారు. మేక ఆకులను తినడం వల్ల దాని పేగులలో మన శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మేక పేగులను తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి.

మేక లేదా గొర్రె.. బోటి కూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి..

ముఖ్యంగా ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి12 అధిక మొత్తంలో లభిస్తాయి. అంతేకానకుండా.. విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, ఫైబర్ కూడా బోటి కూరలో ఉంటాయి. అందుకే.. డైటీషియన్లు బోటి కూరను తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. .

బోటీ రక్తహీనతతో బాధపడే వారికి, అలాగే నాడీ వ్యవస్థ సంబంధిత సమస్యలు ఉన్నవారికి బోటి కూర చాలా ప్రయోజనంగా ఉంటుంది. ఇది శరీరంలోని ముఖ్యమైన జీవక్రియలకు మద్దతు ఇస్తుంది.

బోటిలో ప్రోటీన్ శరీర కండరాల వృద్ధికి తోడ్పడుతుంది.. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

మేక పేగులలో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

అలాగే, జింక్ అధికంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యం, జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. విటమిన్ ఎ, విటమిన్ ఇ వంటి కొవ్వులో కరిగే విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇది మొత్తానికి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, శరీరానికి బలాన్ని ఇస్తుంది.  ఇది ఎముకలకు దృఢత్వాన్ని అందించి, కీళ్లను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

అయితే, బోటి మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తుంది.. దీనిని వారానికి, 10 రోజులకు ఒక్కసారైనా తీసుకోవడం చాలా మంచిది. అయితే.. దీనిని అధికంగా తీసుకోవడం మంచిది కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సమతుల్యంగా, మితంగా మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us