Kerala Special Aravana Payasam: శబరిమల(Shabarimala) అనగానే వెంటనే గుర్తుకొచ్చేది అరవణ ప్రసాదం. కేరళ అయ్యప్ప స్వామి ఆలయం(Ayyappa Swami Temple) లో లభ్యమయ్యే ఈ ప్రసాదం వెరీ వెరీ స్పెషల్. అయితే ఈ ప్రసాదం తరహాలోనే కేరళలో పూజలు, పర్వదినం సమయాల్లో అరవణ పాయసాన్ని తయారు చేస్తారు. ఇది కూడా అయ్యప్ప ప్రసాదంలా ఎంతో రుచిగా ఉంటుంది. కేరళ స్పెషల్ సాంప్రదాయ ప్రసిద్ధ అరవణ పాయసం తయారు చేయడం చాలా సులభం. ఈరోజు ఇంట్లోనే కేరళ స్పెషల్ అరవణ పాయసం తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు:
ఎర్రబియ్యం- ఒక కప్పు
నల్ల బెల్లం – రెండు కప్పుల పొడి
నెయ్యి తగినంత
పచ్చి కొబ్బరి ముక్కలు -ఒక కప్పు
జీడిపప్పులు
శొంఠి పొడి – 2 టీస్పూన్లు
నీళ్లు – 6 కప్పులు
తయారీ విధానం: ముందుగా నల్ల బెల్లం తురుముని తీసుకుని దానిని ఒక గిన్నెలో వేసుకుని కరిగించాలి. ఒక పాన్ తీసుకుని నెయ్యి వేసుకుని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. అనంతరం వాటిని తీసివేసి.. మళ్ళీ జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఎర్రబియ్యం తీసుకుని దానిని అన్నంలా వండుకోవాలి. ఇలా రైస్ ఉడికించి సమయంలో నీటిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. అనంతరం అన్నం మెత్తగా ఉడికిన తర్వాత.. దీనిలో కరిగించుకున్న బెల్లం సిరఫ్ ను వడకట్టుకోవాలి. తర్వాత కొంచెం శొంఠి పొడిని వేసుకుని.. నెయ్యి వేసుకుని మళ్ళీ ఉడికించుకోవాలి. ఉడుకుతున్న సమయంలో బబుల్స్ వస్తుంటే.. స్టౌ ఆఫ్ చేసి.. దానిలో వేయించిన కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసుకోవాలి. అంతే.. ఈజీగా టేస్టీగా కేరళ శబరిమల అరవణ పాయసం రెడీ..
ఈ అరవణ పాయసం చూడడానికే కాదు.. రుచికి కూడా శబరిమల ప్రసాదం తరహాలోనే ఉంటుంది. దీన్ని బియ్యం, బెల్లం, నెయ్యిలతో ఎంతో రుచిగా శుచిగా తయారు చేస్తారు. ఆరోగ్యానికి కూడా మంచిది. శరీరానికి తగిన పోషకాలను కూడా ఇస్తుంది.
Also Read: HUL Price Hike: సామాన్యులకు మరో షాక్.. సబ్బుల నుంచి డిటర్జెంట్ల వరకూ రేట్లు పెంచేసిన FMCG దిగ్గజం..