Health Tips: పెరుగన్నంలో అరటిపండు కలిపి తింటే.. ఇక మీకు తిరుగుండదు పండు

|

Mar 27, 2022 | 12:13 PM

అరటి పండు ఎంత టేస్టీగా ఉంటుందో, ప్రత్యేకంగా చెప్పాల్పిన పనిలేదు. అలాగే ఎంతో బలం కూడా. తిన్న వెంటనే ఎనర్జీ ఉంటుంది.   చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అరటి పండును ఇష్టంగా తింటారు.

Health Tips: పెరుగన్నంలో అరటిపండు కలిపి తింటే.. ఇక మీకు తిరుగుండదు పండు
Curd Rice With Banana
Follow us on

Banana: అరటి పండు ఎంత టేస్టీగా ఉంటుందో, ప్రత్యేకంగా చెప్పాల్పిన పనిలేదు. అలాగే ఎంతో బలం కూడా. తిన్న వెంటనే ఎనర్జీ ఉంటుంది.  చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అరటి పండును ఇష్టంగా తింటారు. అరటిపండు.. శరీరంలోని ఐరన్ లోపాన్ని మెరుగుపరుస్తుంది.. శక్తిని ఇస్తుంది. ఇందులో ఉన్న బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. ఇక పెరుగన్నం(Curd rice)లో అరటిపండు కలిపి తినే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది.  ఇలా చేయడం వలన కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగులో మంచి బ్యాక్టీరియా, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అరటిలో విటమిన్లు, ఐరన్, ఫైబర్ లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూర్చడమే కాకుండా.. శరీరానికి ఉల్లసాన్ని అందిస్తాయి. ఉదయం అల్పాహారంలో అరటి, పెరుగు తీసుకోవడం వలన ప్రయోజనాలు అధికంగానే ఉన్నాయి. పెరుగన్నంలో అరటిపండు కలిపి తింటే తలనొప్పి(Headache) నుంచి వెంటనే విముక్తి లభిస్తుంది. అరుగుదల బాగా ఉంటుంది. అజీర్తి సమస్య పోతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

బరువును అదుపులో ఉంచుతుంది…పెరుగన్నంతో కలిపి అరటి పండు తీసుకోవడం వలన శరీరంలోని కొవ్వు బర్న్ చేస్తుంది. అల్పాహారంలో పెరుగుతోపాటు, అరటి తీసుకోవడం ద్వారా ఎక్కువగా ఆకలి వేయడు. ఫలితంగా క్రమంగా బరువు అదుపులో ఉంటుంది.

ఎముకలు బలంగా.. అరటిలో ఉండే ఫైబర్ పెరుగులో ఉండే బ్యాక్టీరియా రెండు శరీరానికి మేలు చేసేవి. ఇవి కాల్షియం గ్రహించడానికి సహయపడతాయి. పెరుగన్నంలో అరటిపండు కలిపి తీసుకోవడం వలన ఎముకలు బలంగా ఉంటాయి.

మలబద్దకం సమస్య.. మలబద్దకం సమస్యలతో బాధపడుతున్నవారు రోజు ఉదయాన్నే పెరగన్నం అరటిపండు తినడం  మంచిది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Also Read: Hyderabad: ఏప్రిల్ నుంచి హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. అలా చేస్తే డైరెక్ట్ జైలుకే