పిల్లలు, పెద్దలూ ఎంతో ఇష్టంగా తినే వాటిల్లో ఫ్రైడ్ బన్స్ కూడా ఒకటి. ఇవి ఎంతో స్వీట్ గా ఉంటాయి. అందుకే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. చాలా మంది వీటిని బయటనే తిని ఉంటారు. కానీ ఇంట్లో కూడా ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఇష్టంగా పోటీ పడి మరీ తింటారు. ఇంట్లో ఒక్కసారి వీటిని చేశారంటే.. అందరూ ఎంతగానో ఇష్టపడి తింటారు. మరి ఈ ఫ్రైడ్ బన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేయాలన్న వివరాలను ఇప్పుడు చూద్దాం.
ఫ్రైడ్ బన్ కి తయారీకి కావాల్సిన పదార్థాలు:
పాలు, ఈస్ట్, మైదా పిండి, నూనె, పంచదార, ఉప్పు.
కొబ్బరి మిశ్రమానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్:
బెల్లం, పచ్చి కొబ్బరి, టూటీ ఫ్రూటీ, యాలకులు, జీడి పప్పు.
ఫ్రైడ్ బన్ తయారీ విధానం:
ముందుగా ఒక లోతైన గిన్నె తీసుకుని.. అందులో గోరు వెచ్చటి పాలను తీసుకోవాలి. ఇందులో పంచదార, ఈస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిపై మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత వీటిలో గోరు వెచ్చటి నీళ్లు లేదా కావాల్సిన వాళ్లు పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. నెక్ట్స్ దీనిపై నూనె రాసి మూత పెట్టి రెండు గంటల పాటు పక్కకు పెట్టుకోవాలి.
ఈలోపు ఒక మిక్సీ జార్ లో కొబ్బరి ముక్కలు, యాలకులు వేసి ముందు మెత్తగా పట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులో జీడి పప్పు, ట్రూటీ ఫ్రూటీ వేసి కలుపు కోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన పిండిని తీసుకుని మరోసారి అంతా కలుపుకుని కొద్దిగా పిండిని తీసుకోవాలి. చేతికి నూనె రాసుకుంటూ ముందుగా గిన్నె లాగా వత్తుకోవాలి.
ఇలా చేసుకున్న పిండిలో కొబ్బరి ఉండ పెట్టుకుని అంచులను మూసి వేయండి. తర్వాత దీనిని గుండ్రంగా వచ్చేలా వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని కాగిన నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే ఫ్రైడ్ బన్ రెడీ. వీటిని ఓవెన్ లో కూడా బేక్ చేసుకోవచ్చు. 180 డిగ్రీల వద్ద 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వీటిని బేక్ చేసుకోవచ్చు. వీటిని పిల్లలు బాగా ఇష్టంగా తింటారు.