Holi Festival 2021 : హోలీ.. రంగుల ప్రపంచంలో మునిగి పోతుంటారు చాలా మంది. రోజాంతా హోలీ సంబరాల్లో పాల్గోని.. సాయంత్రం వరకు అలసిపోతుంటారు. ఇ ఆసమయంలో చేసుకోవడానికి కొన్ని రకాల ఈజీ స్నాక్స్ మీకోసం మేం అందిస్తున్నాం. అవెంటో తెలుసుకుందామా.
ఈ స్నాక్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. చాలా సులభంగా మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దాహి భల్లా, దహి వాడా మాదిరిగానే.. బ్రెడ్ దహి వడ కూడా చాలా రుచికరంగా మీ ఇంట్లోనే రెడీ చేసుకోండి. ఇందుకోసం కావాల్సినవి కేవలం కొన్ని బ్రెడ్ ముక్కలు, పెరుగు, మసాల దినుసులు.
సర్వవ్యాప్త, రుచికరమైన గుజరాతీ స్నాక్స్‌లో ఒకటైనది ఈ ధోక్లా. దీనిని తయారు చేయడానికి కేవలం తక్కువ సమయం మాత్రమే పడుతుంది. ఇందులో ముఖ్యంగా సెమోలినాను ఉపయోగిస్తారు. కేవలం అరగంటలో రెడి అవుతుంది.
బేబీ కార్న్ పకోడా… మీకు ముందుగానే అర్థమై పోయుంటుంది. మీ ఇంట్లో కూరగాయలతో పకోడా చేసుకోవడం చాలా మందికి తెలిసిన విషయమే. అయితే బేబీ కార్న్ పకోడా చేయడానికి కొంచెం సమయం మాత్రమే పడుతుంది. ఇందుకోసం ముఖ్యంగా మీకు కావాల్సింది.. మొక్కజోన్న, పిండి మాత్రమే.
ఎప్పుడు మార్కెట్లో దోరికే చాట్స్ కాకుండా.. ఈసారి సరికొత్తగా ప్రయత్నించండి. మీ ఇంట్లో ఉండే శనగలతో ఈ హోలీని జరుపుకోండి. వేరుశనగలతో చాట్ రెడీ చేసుకోండి. ఇందులో ఎక్కువగా ప్రోటీన్ కూడా మీకు లభిస్తుంది.
Bred Rolls ఎప్పుడు పండగలకు చేసుకునే బ్రెడ్ రోల్స్ ఈసారి మళ్లి ఒకసారి ట్రై చేయండి. ఇందుకోసం కాస్తా వెరైటీగా చపాతీలను కూడా ఈ బ్రెడ్ రోల్స్‌కు యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని బంగాళ దుంపలను తీసుకోండి.
వీటిని సౌత్ ఇండియాలో ఎక్కువగా చేసుకుంటుంటారు. ఇవి చూడటానికి బాల్స్ మాదిరిగా కనిపిస్తాయి. వీటిని తయారు చేయడానికి కొంచెం సమయం మాత్రమే పడుతుంది. అలాగే దీనికి మరింత రుచిని అందించడానికి వేజ్ కర్రీస్ యాడ్ చేయండి. మరీ ఈసారి హోలీని ఈ వంటలతో సెలబ్రేట్ చేసుకోండి.
Also Read:
Holi 2021: హోలీలో వాడే గులాల్ రంగు నుంచి మీ జుట్టును ఈ విధంగా కాపాడుకోండిలా..