Rainy Season Diet: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల రాకుండా రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్ ఏమిటంటే

|

Jun 25, 2021 | 4:39 PM

Rainy Season Diet: ప్రకృతి మానవ శరీరానికి మధ్య అనుబంధం ఉంది. కాలానికి అనుగుణంగా ప్రకృతిలో పండ్లు.. తినే ఆహారం లభ్యమవుతాయి. ఆ సీజన్ లో దొరికే ఆహారాన్ని తీసుకుంటే.. మంచి ఆ కాలంలో వచ్చే వ్యాధ్యుల నుంచి..

Rainy Season Diet: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల రాకుండా రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్ ఏమిటంటే
Rainy Diet
Follow us on

Rainy Season Diet: ప్రకృతి మానవ శరీరానికి మధ్య అనుబంధం ఉంది. కాలానికి అనుగుణంగా ప్రకృతిలో పండ్లు.. తినే ఆహారం లభ్యమవుతాయి. ఆ సీజన్ లో దొరికే ఆహారాన్ని తీసుకుంటే.. మంచి ఆ కాలంలో వచ్చే వ్యాధ్యుల నుంచి రక్షణ కలిపిస్తుంది. అందుకనే కాలానికి అనుగుణంగా తినేవారు వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు. ఎందుకంటే సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉండాలంటే శరీరానికి తగిన శక్తిని, రోగనిరోధక శక్తిని ఆహారం అందిస్తుంది కనుక.. వేసవి వేడి నుంచి ఉపశమనంనిస్తూ.. వర్షాలు కురుస్తున్నారు. ఈ నేపథ్యంలో శరీరం వ్యాధ్యుల బారిన పడకుండా ఉండాలంటే.. . పోషకాలు అధికంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్ధాలను తినాల్సి ఉందని పోషకాహార నిపుణులుచెబుతున్నారు.

వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఆహారంలో కూడా మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. వాతావరణ పరిస్థితులలో విపరీతమైన మార్పు మన జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అందుకని ఈ వర్షాకాలంలో ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారపదార్ధాల గురించి తెలుసుకుందాం..

*మొక్కజొన్న ఆరోగ్యకరమైన రుతుపవనాల ఆహారం. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో లుటిన్ మరియు ఫైటోకెమికల్స్ ఉంటాయి. అంతేకాదు కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో మొక్కజొన్న చినుకులు పడుతున్నప్పుడు ఇష్టంగా తినే చిరుతిండి. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మొక్కజొన్నను ఉడికించుకుని లేదా కాల్చుకుని తినవచ్చు.
*వర్షాకాలంలో తినదగిన మరో ఆరోగ్యకరమైన పండు బొప్పాయి. దీనిలో యాంటీపైరెటిక్ చర్య వర్షాకాలంలో జ్వరం, దగ్గు మరియు జలుబు వంటి చిన్న తరహా సమస్యలను నివారిస్తుంది.
*ఆపిల్‌, దానిమ్మలను ఎక్కువగా తినాలి. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి.
* అల్లం, మిరియాలు, తేనె, పుదీనాతో తయారు చేసిన హెర్బల్‌ టీలు తీసుకోండి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలుంటాయి.
* తాజా ముల్లంగి రసాన్ని తాగితే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
* మొక్కజొన్న, శనగపిండి, శనగలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం.
* బ్రౌన్‌రైస్‌, ఓట్స్‌, బార్లీలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
* వెల్లుల్లిని సూప్‌లలో, కూరలలో విధిగా వేయండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది.
*వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. కనుక జీర్ణ సంబంధిత అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకని అరటి పండు ఉత్తమ రక్షణ. అరటిలో జీర్ణక్రియకు తోడ్పడే విటమిన్లు ఖనిజాలు ఉంటాయి. వాటిలో ఆస్కార్బిక్ ఆమ్లం (విటమిన్ సి) మరియు రెటినాల్ కూడా ఉన్నాయి, ఇవి మన శరీరం యొక్క రోగనిరోధక శక్తిని అధికంగా ఉంచడంలో సహాయపడతాయి. అరటిపండ్లు తక్కువ కేలరీలను కలిగి ఉండి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండటానికి సహాయపడతాయి.

ఈ కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అందువల్ల ఏది పడితే అది తింటే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముఖ్యంగా బయట ఫుడ్ ను తగ్గిస్తే ఆరోగ్యంగా వర్షాకాలాన్ని ఎంజాయ్ చేయవచ్చు.

Also Read:  నిరుద్యోగులకు గుడ్ న్యూస్ 8వ తరగతి అర్హతతో.. 14 వేల జీతంతో ఉద్యోగకాశం..