Benefits of Sabja Seeds: సబ్జా గింజలు మహిళలకు ఓ దివ్య వరం…. సబ్జాలను ఈ విధంగా తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం

|

Apr 20, 2021 | 3:37 PM

Benefits of Sabja Seeds: వేసవి వచ్చిందంటే చాలు.. అందరి ఇళ్లల్లో ను చిన్నచిన్నగా ఉండే సబ్జా గింజలు దర్శనమిస్తాయి. అయితే ఈ సబ్జా గింజల వలన

Benefits of Sabja Seeds: సబ్జా గింజలు మహిళలకు ఓ దివ్య వరం.... సబ్జాలను ఈ విధంగా తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం
7
Follow us on

Benefits of Sabja Seeds: వేసవి వచ్చిందంటే చాలు.. అందరి ఇళ్లల్లో ను చిన్నచిన్నగా ఉండే సబ్జా గింజలు దర్శనమిస్తాయి. అయితే ఈ సబ్జా గింజల వలన ఎన్నో లాభాలున్నాయి.. మరీ ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే మహిళలకు సబ్జా గింజలు ఓ దివ్య వరం అని చెప్పవచ్చు. బరువు తగ్గాలనుకునే స్త్రీలు సబ్జాను నానబెట్టిన నీటిని తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయాటిక్‌లాగా పనిచేస్తుందని చెబుతున్నారు.

బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు… ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతోబాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.

శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను తాగడం సహజంగా బరువుని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని ఇవి కలిగివుంటాయి.

ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్‌, నియాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ ‘ఇ’ లభించడంతో బాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కనుక వేసవి లో దాహార్తితో పాటు.. శరీర బరువుని కూడా తగ్గించే సబ్జాలను తాగండి. ఆరోగ్యంగా ఉండండి.

Also Read: గుత్తిదొండకాయ మసాలా కూర తయారీ విధానం తెలుసుకుందాం..!