షుగర్ వ్యాధికి ఛూమంత్రం.. దీనిని లైట్ తీసుకోకండి.. ఉదయాన్నే పరగడుపున రెండు తింటే..

|

Oct 06, 2024 | 9:19 AM

అంజీర్‌ ( అత్తిపండు ) లో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. అంజీర్ చాలా రుచికరమైన పండు.. అత్తిపండును ఎలాగైనా తినొచ్చు.. పండుగా ఉన్నప్పుడు.. అలాగే ఎండిన అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ లా తినవచ్చు. కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త వులువు ఉండే అత్తిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

షుగర్ వ్యాధికి ఛూమంత్రం.. దీనిని లైట్ తీసుకోకండి.. ఉదయాన్నే పరగడుపున రెండు తింటే..
Health Benefits Of Figs
Image Credit source: Getty Images
Follow us on

అంజీర్‌ ( అత్తిపండు ) లో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. అంజీర్ చాలా రుచికరమైన పండు.. అత్తిపండును ఎలాగైనా తినొచ్చు.. పండుగా ఉన్నప్పుడు.. అలాగే ఎండిన అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ లా తినవచ్చు. కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త వులువు ఉండే అత్తిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అద్భుతమైన రుచితోపాటు పోషకవిలువలు కూడా పుష్కలంగా ఇందులో ఉన్నాయి. దీన్ని రెగ్యులర్ గా తింటే శరీరానికి విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా అందుతాయి. అందుకే.. రోజుకు 2 నుంచి 3 అత్తి పండ్లను తినాలని వైద్య నిపుణులు చెబుతుంటారు.

అంజీర ఫలంలో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. అంజీర్ తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.. రక్తంలో కొవ్వు స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిలో ఉన్న అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి.. డయాబెటిస్ కంట్రోల్ లో ఉండేలా చేస్తుంది..

ఎండిన అత్తి పండ్ల (అంజీర్) ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మధుమేహంలో మేలు చేస్తుంది: మీరు 2 ఎండిన అత్తి పండ్లను తీసుకుంటే, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ దాదాపు 60 ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు మితమైన ఆహారంగా మారుతుంది. ఈ పండులో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది టైప్-2 డయాబెటిస్ రోగులలో గ్లూకోజ్ జీవక్రియను పెంచే సమ్మేళనం. దీన్ని పరిమిత పరిమాణంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

బరువు తగ్గుతుంది: బరువు తగ్గాలనుకునే వారికి ఎండిన అత్తిపండ్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే వాటిలో ఉండే డైటరీ ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. ఇంకా మీరు అతిగా తినడాన్ని నియంత్రిస్తుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: మారుతున్న సీజన్‌లో, మనం తరచుగా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల అనేక వ్యాధుల బారిన పడుతున్నాము.. దీని కోసం మీరు మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం.. అప్పుడే మీరు సీజనల్ జ్వరం, దగ్గు, జలుబును నివారించగలుగుతారు. విటమిన్ సి, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నందున రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎండిన అత్తి పండ్లను తినమని చాలా మంది డైటీషియన్లు సిఫార్సు చేస్తున్నారు.

ఎప్పుడు తినాలి..

అంజీర్‌ని మీ అల్పాహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరానికి మంచి పోషకాలు అందుతాయి.. ఉదయం ఖాళీ కడుపుతో మొదటగా తినాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఎండిన అంజీర్ అయితే.. నీటిలో నానాబెట్టుకుని తినడం చాలామంచిది.

అయితే.. కడుపునొప్పి, కిడ్నీలో రాళ్లు, కాలేయ వ్యాధి, మైగ్రేన్‌తో బాధపడుతున్న రోగులు ఈ పండును తినకూడదని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)