Hair Growth Tips: ఒత్తైన, పట్టులాంటి జుట్టు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? వీటిని రెగ్యులర్‌గా తింటే సరి

హెయిర్‌ఫాల్‌ను నిరోధించేందుకు చాలామంది మార్కెట్లో దొరికే రసాయన ఉత్పత్తులను వినియోగిస్తుంటారు. ఇందులోని కెమికల్స్ జుట్టు ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి. అటువంటి పరిస్థితిలో జుట్టుకు లోతైన పోషణ అందించేందుకు ఆహారంలో కూరగాయలు, పండ్లు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు.

Hair Growth Tips: ఒత్తైన, పట్టులాంటి జుట్టు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా?  వీటిని రెగ్యులర్‌గా తింటే సరి
Hair Care
Follow us

|

Updated on: Jan 14, 2023 | 8:21 PM

తీవ్రమైన పని ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, పోషకాల్లేని ఆహారం, దుమ్ము, వాయు కాలుష్యం.. ఇలా మన జుట్టు ఆరోగ్యం దెబ్బతినడానికి చాలా కారణాలున్నాయి. దీని వల్ల వెంట్రుకల కుదుళ్లు బలహీనపడతాయి. కురులు రాలిపోతాయి. అలాగే జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. అయితే హెయిర్‌ఫాల్‌ను నిరోధించేందుకు చాలామంది మార్కెట్లో దొరికే రసాయన ఉత్పత్తులను వినియోగిస్తుంటారు. ఇందులోని కెమికల్స్ జుట్టు ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి. అటువంటి పరిస్థితిలో జుట్టుకు లోతైన పోషణ అందించేందుకు ఆహారంలో కూరగాయలు, పండ్లు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఇందులోని పోషకాలు వెంట్రుకల కుదుళ్లను దృఢంగా మారుస్తాయి. చుండ్రు, హెయిర్‌ఫాల్‌ సమస్యలను నిరోధిస్తాయి. అలాగే జుట్టు వేగంగా పెరిగేలా సహాయపడతాయి. మరి ఆ సూపర్‌ ఫుడ్స్‌ ఏంటో తెలుసుకుందాం రండి.  ఆకుకూరల్లో ఐరన్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.  ముఖ్యంగా గుమ్మడికాయలో ఐరన్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ సి, ఇ సమృద్ధిగా ఉంటాయి. గుమ్మడికాయ తీసుకోవడం వల్ల మీ జుట్టు వేగంగా పెరుగుతుంది.

ఆకు కూరలు

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌లో బచ్చలికూర, బ్రోకలీ వంటి కూరగాయలు ఉంటాయి. ఈ కూరగాయలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో విటమిన్ ఎ, సి, కెరోటిన్, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి. తద్వారా స్కాల్ప్ హైడ్రేటెడ్ గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

క్యారెట్‌

క్యారెట్ విటమిన్ ఎ మంచి మూలం. ఇది జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.

చిలగడదుంపలు

తీపి బంగాళాదుంపల్లో బీటా కెరోటిన్ విరివిగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. జుట్టు వేగంగా, అలాగే బలంగా పెరగడానికి సహాయపడుతుంది.

క్యాప్సికమ్‌

క్యాప్సికమ్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

అవకాడో

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. అలాగే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. అవకాడోను హెయిర్ మాస్క్‌గా కూడా జుట్టుకు అప్లై చేసుకోవచ్చు.

అరటిపండ్లు

అరటిపండ్లలో విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి హెయిర్‌ ఫాల్ సమస్యలను నివారిస్తాయి. జుట్టు కుదుళ్లను బలంగా మార్చి చుండ్రు సమస్యలను తగ్గిస్తాయి.

బొప్పాయి

బొప్పాయిలో విటమిన్ ఎ, సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. అలాగే ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. బొప్పాయి చుండ్రు సమస్యలను తగ్గిస్తుంది. అలాగే జుట్టును మృదువుగా చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..