Gas Problem: గ్యాస్ సమస్య వేధిస్తోందా.? ఈ 5 వంటింటి చిట్కాలు పాటించండి.!

|

Feb 23, 2022 | 9:57 AM

ఈ మధ్యకాలంలో చాలామంది గ్యాస్ సమస్య ఇబ్బంది పెడుతోంది. ఉరుకుల పరుగుల జీవితం.. ఆపై పని ఒత్తిడి.. ఇంకేముంది సరైన...

Gas Problem: గ్యాస్ సమస్య వేధిస్తోందా.? ఈ 5 వంటింటి చిట్కాలు పాటించండి.!
Gas Problem
Follow us on

ఈ మధ్యకాలంలో చాలామంది గ్యాస్ సమస్య ఇబ్బంది పెడుతోంది. ఉరుకుల పరుగుల జీవితం.. ఆపై పని ఒత్తిడి.. ఇంకేముంది సరైన సమయానికి ఫుడ్ తినకపోవడంతో గ్యాస్ సమస్య తలెత్తుతోంది. ఈ సమస్యతో ఏదీ మనస్పూర్తిగా తినలేం. కొంచెం ఫుడ్ తీసుకుంటే చాలా.. కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. అయితే గ్యాస్ ప్రాబ్లమ్‌‌కు కొన్ని వంటింటి చిట్కాలతో చెక్ పెట్టొచ్చు. అవేంటో చూసేద్దాం పదండి..

వాము, నల్ల ఉప్పు:

కొన్నిసార్లు మనం తినకూడదని ఆహారం తిన్నప్పుడు.. అది గుండెల్లో మంటకు, గ్యాస్‌ సమస్యకు దారి తీస్తుంది. దాన్ని తేలికగా తీసుకోవద్దు. ఆ సమస్య ఎక్కువైతే.. తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే ఆ గ్యాస్ సమస్యను కంట్రోల్ చేసేందుకు కొంచెం వాము, నల్ల ఉప్పు కలిపిన వేడినీటిని రోజుకు రెండు సార్లు తాగితే ఎంతో మేలు చేస్తుంది.

పెరుగు:

ఇందులో ఉండే గుణాలు కడుపులో గ్యాస్ సమస్యను మాత్రమే కాదు.. అనేక ఇతర సమస్యలను కూడా నయం చేస్తాయి. కడుపు సంబంధిత రోగాలు దరికి చేరకుండా ఉండాలంటే పెరుగు తినడం తప్పనిసరి అని వైద్యులు చెబుతుంటారు. మీరు తరచూ గ్యాస్ సమస్యను ఎదుర్కుంటున్నట్లయితే, తప్పనిసరిగా పెరుగు తినాలి. మీరు మీ ఆహారంలో పెరుగును రెండు విధాలుగా చేర్చవచ్చు. ఒకటి రోజూ మధ్యాహ్నం మజ్జిగ కింద చేసి తాగండి. లేదా పెరుగులో నల్ల ఉప్పు వేసి తినండి.

జీలకర్ర:

గ్యాస్‌ సమస్య నుంచి రిలీఫ్ పొందేందుకు జీలకర్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాదు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కడుపులో గ్యాస్ సమస్య తగ్గకపోతే, రోజూ అర టీస్పూన్ జీలకర్ర తినండి. అలాగే వేయించిన జీలకర్ర గింజలను చూర్ణం చేసి వాటిని ఒక గ్లాసు వేడినీటిలో కలుపుకుని తాగండి.

దాల్చిన చెక్క:

ఈ మసాలా దినుసు నేచురల్ యాంటాసిడ్‌గా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. దాల్చిన చెక్క టీ తాగితే.. జీర్ణశయాంతర ప్రేగులలో ఉండే ఇన్ఫెక్షన్లను సైతం నయం అవుతాయి. దాల్చిన చెక్క ఎన్నో పోషకాలు, గుణాలు కలిగిన పవర్‌ హౌస్ అని చెప్పొచ్చు.

అలాగే గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఎలప్పుడూ పాల ఉత్పత్తులు, వేయించిన ఆహారాలు, కెఫిన్ పానీయాలు, చాక్లెట్‌లు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి