
రక్తపోటును సహజంగా ఎలా తగ్గించుకోవాలి, వెల్లుల్లి టీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.. వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు ప్రతి వంటకంలోనూ దీనిని ఉపయోగిస్తూనే ఉంటారు. వెల్లుల్లి వంటలకు రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ‘అల్లిసిన్’ అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉండటమే కాకుండా, ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతుంది. ముఖ్యంగా రక్తపోటును అదుపులో ఉంచడంలో వెల్లుల్లి పాత్ర అనన్యం.
వెల్లుల్లి టీని తయారు చేసుకోవడం చాలా సులభం. దీనికి కావాల్సిన పదార్థాలు:
ఒక గిన్నెలో మూడు కప్పుల నీరు పోసి వేడి చేయాలి. అందులో మూడు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఈ నీటిని 4 నుండి 5 నిమిషాల పాటు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులోకి రావడమే కాకుండా, శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
వెల్లుల్లి టీ కేవలం బీపీకి మాత్రమే కాకుండా జీర్ణశక్తిని మెరుగుపరచడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అయితే ఇప్పటికే బీపీకి మందులు వాడుతున్న వారు ఈ టీని ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. వంటింట్లో దొరికే వెల్లుల్లితో మీ గుండెను భద్రంగా ఉంచుకోండి.