Liver Care: ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా..? ఫ్యాట్‌కు చెక్ పెట్టే సూపర్ ఫ్రూట్స్ ఇవే..!

Healthy Liver: ఫ్యాటీ లివర్ ఇప్పుడు ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల ఉత్పన్నమవుతుంది. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే, మొత్తం ఆరోగ్యంపై నేరుగా ప్రభావం పడుతుంది. ఫ్యాటీ లివర్ కారణంగా కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది, శరీరంలో విషపదార్థాల (టాక్సిన్స్) స్థాయిలు పెరుగుతాయి. జీవక్రియలో అసమతుల్యత కలుగుతుంది. అందువల్ల, ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడానికి, గ్యాస్ట్రో లివర్ నిపుణులు, ఆహారంలో ఈ ఐదు రకాల పండ్లను చేర్చాలని సూచిస్తున్నారు.

Liver Care: ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా..? ఫ్యాట్‌కు చెక్ పెట్టే సూపర్ ఫ్రూట్స్ ఇవే..!
Liver Care

Updated on: Mar 05, 2026 | 8:54 PM

కాలేయం మన శరీరంలో అత్యంత ముఖ్యమైన, రెండవ అతిపెద్ద అవయవం. ఇది శరీరానికి 500 కంటే ఎక్కువ విధులను నిర్వహిస్తుంది. అందువల్ల, ఆరోగ్యకరమైన, చురుకైన కాలేయాన్ని ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ, సరైన ఆహారం తీసుకోకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి వలన కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం (ఫ్యాటీ లివర్) సాధారణం. దీని వల్ల కాలేయ సామర్థ్యం తగ్గి, శరీరంలోని అనేక అవయవాల పనితీరు ప్రభావితమవుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యను నిరోధించడానికి, ఆరోగ్యకరమైన కాలేయాన్ని నిర్వహించడానికి కొన్ని ముఖ్యమైన జీవనశైలి మార్పులు ఇప్పుడు తెలుసుకుందాం.

జీవనశైలి మార్పులు

  • సమతుల్య ఆహారం తీసుకోవడం
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
    తగినంత నిద్ర తీసుకోవడం
  • తగినంత నీరు త్రాగడం

అంతేకాదు, కొన్ని పండ్లను ఆహారంలో చేర్చడం వల్ల కాలేయంలో కొవ్వు నిల్వలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో ఉపకరిస్తున్న కొన్ని పండ్లు..

1. సిట్రస్ పండ్లు

నారింజ, నిమ్మకాయ, బత్తాయి, కమలాఫలం వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కాలేయాన్ని విష పదార్థాల నుంచి రక్షిస్తాయి. విటమిన్ C కాలేయ నిర్విషీకరణలో సహాయపడుతుంది. కొవ్వు పేరుకుపోవడానికి అడ్డుగట్టుతుంది.

2. ఆపిల్

ఆపిల్స్ లో కరిగే ఫైబర్ (పెక్టిన్) ఎక్కువగా ఉంటుంది. ఇది కాలేయంలో కొవ్వు తగ్గించడంలో, నిర్విషీకరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజూ ఒక ఆపిల్ తినడం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

3. బొప్పాయి

బొప్పాయిలో విటమిన్లు, ఎంజైములు పుష్కలంగా ఉంటాయి, ఇవి జీర్ణక్రియకు మద్దతు ఇస్తాయి. ఫ్యాటీ లివర్ ఉన్నవారికి బొప్పాయి తినడం వల్ల కాలేయంపై భారాన్ని తగ్గించడంలో, పనితీరు మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

4. కివి

కివిలో విటమిన్లు, ఖనిజాల మిశ్రమం ఉంటుంది. ఇది కాలేయ ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది. అలాగే, కాలేయంపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.

ముఖ్యమైన విషయం ఏంటంటే.. పండ్లను సక్రమంగా ఆహారంలో చేర్చడం, సమతుల్య ఆహారం, వ్యాయామం, తగిన నిద్ర, నీరు త్రాగడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను నిరోధించవచ్చు. ఆరోగ్యకరమైన కాలేయాన్ని కొనసాగించవచ్చు.

Follow Us