
మటన్ కర్రీని సరిగా వండి తింటే దాని కంటే స్పెషల్ డిష్ ఇంకోటి ఉండదు. ఇది మంచి రుచికర భోజనమని చెప్పుకోవాలి. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. కాకపోతే దీనిని మరి ఎక్కువ తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

వెల్లుల్లి: మటన్ తిన్న వెంటనే వెల్లుల్లిని దూరం పెట్టడమే మంచిది. పొరపాటున దీన్ని తింటే వాంతులు అయ్యే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి. గుండె సమస్యలున్న వారు కూడా దీనిని తినకపోవడమే మంచిది.

తేనె: అలాగే, మటన్ తిన్న తర్వాత తేనెను తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే, మటన్‌లో ఉండే పోషకాలు తేనెకి యాంటీ గా పని చేస్తుంది. దీని వలన రక్తపోటు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.

నిమ్మకాయ: కొందరు మటన్ తినేటప్పుడు నిమ్మకాయ పిండుకుని తింటారు. కానీ, ఇది మంచి పద్ధతి కాదని వైద్యులు చెబుతున్నారు. నిమ్మ రసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ అది గ్యాస్ట్రిక్ సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి, మటన్ తో తినకపోవడమే మంచిది.

కాబట్టి, మటన్ తిన్న తర్వాత పైన చెప్పిన వాటిని టచ్ కూడా చేయొద్దు. ఒక వేళ మీరు తింటే కోరి సమస్యలు తెచ్చుకున్నట్లే. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)