Health Benefits of Apricots : ఈ పండు అమృతంతో సమానం..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

ఆప్రికాట్లలో విటమిన్ సి, విటమిన్ ఎతో పాటు ఫైటో న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడతాయి. క్యాన్సర్ నివారిణిగా సహాయపడే కెరోటినాయిడ్స్, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఆప్రికాట్లలో అధికంగా ఉన్నాయి. క్రమం తప్పకుండా ఆప్రికాట్లు తినడం ద్వారా క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు.

Health Benefits of Apricots : ఈ పండు అమృతంతో సమానం..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Apricots

Updated on: Jun 18, 2024 | 9:18 PM

ఆప్రికాట్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా ఎండిన ఆప్రికాట్ రుచి చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన పండు,డ్రై ఫ్రూట్. డ్రై ఆప్రికాట్లు మిమ్మల్ని ఆరోగ్యవంతంగా చేయడంలో, అనేక వ్యాధులను దూరం చేయడంలో సహాయపడతాయి. దీంతో శరీరానికి సమృద్ధిగా పోషకాలు అందుతాయి. ఆప్రికాట్‌లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. కెరోటినాయిడ్స్ వంటి ఫైటోకెమికల్స్ ఎండిన ఆప్రికాట్‌లలో కూడా కనిపిస్తాయి. ఈ పోషకాలన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.ఈ తినడం వల్ల ఏయే వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుందో తెలుసుకుందాం.

ఆప్రికాట్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కదలికల్ని మెరుగుపర్చడం ద్వారా మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. మలబద్ధకంతో బాధపడుతున్నవారు ఈ పండు తినడం చాలా మంచిది. ఆఫ్రికాట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇది కంటిచూపును మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. ఫ్రీరాడికల్స్ వల్ల జరిగే నష్టం నుంచి కాపాడుతుంది. ఆప్రికాట్‌లోని ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గాలనుకునే వారు కూడా ఆప్రికాట్ తినొచ్చు.

ఎముకల బలానికి అవసరమయ్యే కాల్షియం, ఐరన్, రాగి, మాంగనీస్, ఫాస్పరస్ వంటి ఆవశ్యక మూలాలు ఆప్రికాట్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆప్రికాట్లలో రోగనిరోధక శక్తిని పెంపొందించే అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ పెంచి అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాయి. ఆప్రికాట్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి దోహదపడుతుంది. తద్వారా రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆప్రికాట్లలో శరీరానికి వేడి నుంచి ఉపశమనం అందించే లక్షణాలు ఉన్నాయి. అలాగే ఇందులోని యాంటీఇంఫ్లమేటరీ లక్షణాలు వాపు, నొప్పి వంటి వాటిని తగ్గిస్తాయి. ఆప్రికాట్లలో విటమిన్ సి, విటమిన్ ఎతో పాటు ఫైటో న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడతాయి. క్యాన్సర్ నివారిణిగా సహాయపడే కెరోటినాయిడ్స్, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఆప్రికాట్లలో అధికంగా ఉన్నాయి. క్రమం తప్పకుండా ఆప్రికాట్లు తినడం ద్వారా క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us