
జీవితంలో ఒకసారి షుగర్ వ్యాధి వస్తే ..తెలియని ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు పెద్ద వాళ్లకు మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు 25 ఏళ్ళు లోపు ఉన్న వారు కూడా ఈ సమస్యతో బాధ పడుతున్నారు. దీనికి కారణం మనం తీసుకునే ఫుడ్స్. ఇక్కడ కంట్రోల్ చేసుకుంటే అన్ని కంట్రోల్ అవుతాయి.

దాల్చిన చెక్క నీరు: దాల్చిన చెక్కను ఒక కప్పు నీటిలో బాగా మరిగించి ఆ తర్వాత వాటిని వడకట్టి తాగాలి. ఇలా తాగడం వలన కంట్రోల్లో లేని షుగర్ కూడా మొత్తం కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే, గ్లూకోజ్ ప్రక్రియను నెమ్మది చేస్తుంది.

ఉసిరి రసం : ఉసిరిలో విటమిన్-సి ఉంటుంది. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి. ఒక టేబుల్ స్పూన్ ఉసిరి రసాన్ని తీసుకుని దానిలో ఒక గ్లాస్ నీరు పోసి దానిలో ఉప్పు వేసుకుని తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది.

కాకరకాయ రసం: ఒక చిన్న కాకరకాయను తీసుకుని దానిని గ్రైండ్ చేసుకుని పేస్ట్ లా చేసుకుని దీన్ని తాగాలి. ఇలా ఉదయం తాగడం వలన షుగర్ కంట్రోల్ అవుతుంది.

కలబంద రసం : రక్తంలో షుగర్ లెవెల్స్ ను కలబంద తగ్గించగలదు. ఒక గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్ ను వేసి బాగా తిప్పుకుని తాగాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)