ఇడ్లీ అనగానే మినపపప్పు, బియ్యం మిశ్రమంతో తయారు చేసేది. అయితే మరింత ఆరోగ్యకరంగా తేలికగా జీర్ణమయ్యేలా ఓట్స్ ఇడ్లీ ట్రై చేయొచ్చు. ఇది గ్లూటెన్-ఫ్రీ మాత్రమే కాకుండా.. తయారీలోనూ చాలా తక్కువ సమయం పడుతుంది. ఈ హెల్తీ రెసిపీని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.
ముందుగా ఓట్స్‌ను గోధుమ రంగు వచ్చేంత వరకు తక్కువ మంటపై వేయించి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత గ్రైండ్ చేసిన ఓట్స్ పొడిని సూజి, పెరుగు, తగినంత నీటితో మిశ్రమం చేసుకుని మెత్తని బ్యాటర్‌లా తయారు చేసుకోవాలి. దీనిలో తురిమిన అల్లం, సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.
ఇదిలా ఉంచి చిన్న పాన్ తీసుకుని అందులో ఆవాలు, మినప్పప్పు, హింగు, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి వేగించి సువాసన వచ్చేంత వరకు తాలింపు సిద్ధం చేసుకోవాలి. ఆ తాలింపును ఓట్స్-సూజి మిశ్రమంలో వేసి మరోసారి బాగా కలపాలి. చివరిగా, ఈ మిశ్రమంలో ఈనో ఫ్రూట్ సాల్ట్‌ను వేసి మెల్లగా కలిపి తక్షణమే వాడాలి.
తయారైన బ్యాటర్‌ను ముందుగా నూనె రాసిన ఇడ్లీ ప్లేట్స్‌లో వేసి.. వేడిపెట్టిన స్టీమర్‌లో 10-12 నిమిషాలు మిడియం మంటపై ఆవిరితో ఉడకనివ్వాలి. ఇడ్లీలు పూర్తిగా ఉడికిన తర్వాత అవి చల్లారనివ్వాలి. తర్వాత వాటిని సాంబారు, కొబ్బరి చట్నీతో వడ్డించి ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ను ఆనందంగా ఆస్వాదించండి.