ఉదయాన్నే చద్దన్నం తినాలంటే మోహం మాడ్చుకుంటున్నారా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

రాత్రి మిగిలిపోయిన అన్నంలో నీరు పోసి మరుసటి రోజు ఉదయం తింటే దాన్నే సద్దన్నం లేదా చద్ది అన్నం అంటారు. ఇది మన దేశంలో ఎంతో కాలంగా వస్తున్న ఆరోగ్యకరమైన సాంప్రదాయ ఆహారం. రాత్రిపూట పులియబెట్టడం వల్ల ఈ అన్నంలో విటమిన్ బి-12, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు రెట్టింపు అవుతాయి. ఉదయం పూట పరిగడుపున లేదా అల్పాహారంగా దీనిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. పూర్తి ప్రయోజనాలు తెలియాలంటే ఫుల్‌ డిటెల్స్‌లోకి వెళ్లాల్సిందే..

ఉదయాన్నే చద్దన్నం తినాలంటే మోహం మాడ్చుకుంటున్నారా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
Fermented Rice Benefits

Updated on: Nov 09, 2026 | 8:43 PM

నేటి ఆధునిక జీవనశైలిలో రకరకాల ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్‌కు అలవాటు పడి, మన పూర్వీకులు ఆచరించిన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చాలావరకు దూరం చేసుకుంటున్నాం. అలాంటి అద్భుతమైన సాంప్రదాయ ఆహారాల్లో చద్దన్నం ఒకటి. రాత్రి మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసి మరుసటి రోజు ఉదయం తినే ఈ సాధారణ ఆహారంలో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. దీనిని తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పోషకాలు రెట్టింపు అవుతాయి:

అన్నాన్ని నీటిలో రాత్రి అంతా నానబెట్టి పులియబెట్టడం వల్ల అందులో ఉండే సూక్ష్మజీవులు, మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల సాధారణ అన్నంలో ఉండే పోషకాల కంటే, పులియబెట్టిన అన్నంలో విటమిన్ బి-6, విటమిన్ బి-12, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాల మోతాదు విపరీతంగా పెరుగుతుంది. ఇది శరీర పోషకాహార లోపాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియకు ఎంతో మేలు:

ఉదయం పూట అల్పాహారంగా సద్దన్నం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఎంతో చురుగ్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే ప్రొబయోటిక్స్ గట్ హెల్త్ ను మెరుగుపరుస్తాయి. గ్యాస్, అసిడిటీ, కడుపులో మంట, మలబద్ధకం వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

శరీరానికి శక్తి, చలువ:

ఉదయం పూట ఈ అన్నం తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ చద్ది అన్నం తినడం వల్ల శరీరం లోపలి నుంచి చల్లబడుతుంది. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.

బరువు నియంత్రణ, రోగ నిరోధక శక్తి:

సద్దన్నంలో క్యాలరీలు తక్కువగా మరియు ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది అనవసరమైన స్నాక్స్ తినకుండా అడ్డుకుని, బరువు నియంత్రణలో ఉంచడానికి సహకరిస్తుంది. అంతేకాకుండా, రోగ నిరోధక శక్తిని పెంచి, చిన్నపాటి అనారోగ్యాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

ఎంతో ఖరీదైన సప్లిమెంట్లు వాడే బదులు, మన సంప్రదాయంలో భాగమైన ఈ సద్దన్నంను ఉదయం అల్పాహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది సులభమైన, ఉత్తమమైన మార్గం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us