Tea Effect: టీతో జర జాగ్రత్త..! మళ్లీ మళ్లీ వేడిచేసి తాగకూడదు..? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

|

Sep 12, 2021 | 9:05 PM

Tea Effect: మనలో చాలామంది టీతో రోజును ప్రారంభిస్తారు. దాని అద్భుతమైన రుచి అందరికి నచ్చుతుంది. మనకు రకరకాల టీలు మార్కెట్లో లభిస్తాయి. టీ తాగిన తర్వాత

Tea Effect: టీతో జర జాగ్రత్త..! మళ్లీ మళ్లీ వేడిచేసి తాగకూడదు..? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
Tea
Follow us on

Tea Effect: మనలో చాలామంది టీతో రోజును ప్రారంభిస్తారు. దాని అద్భుతమైన రుచి అందరికి నచ్చుతుంది. మనకు రకరకాల టీలు మార్కెట్లో లభిస్తాయి. టీ తాగిన తర్వాత మనకి రిఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఆఫీసులో పని అలసటను తొలగించుకోవడానికి ఉద్యోగులు తరచుగా టీ తాగుతారు. అయితే కొంతమందికి అవసరమైన దానికంటే ఎక్కువ టీ తాగే అలవాటు ఉంటుంది. ఇది చాలా చెడ్డ అలవాటు. ఎందుకంటే అధికంగా టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. అయితే కొంతమంది ఒకేసారి పెద్ద మొత్తంలో టీ తయారుచేసి అవసరమైనప్పుడు దానిని పదే పదే వేడి చేసి తాగుతారు. ఇలా చాలాసార్లు వేడి చేసిన టీ తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. మళ్లీ మళ్లీ వేడి చేసిన ఎందుకు తాగకూడదో ఒక్కసారి తెలుసుకుందాం.

1. చెడు వాసన
టీని మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల దాని రుచి మారిపోతుంది. చెడు వాసన వస్తుంది. ఇది కాకుండా టీని పదే పదే వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు తగ్గుతాయి.

2. బ్యాక్టీరియా పెరుగుతుంది
చాలా సమయం క్రితం చేసిన టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే టీ చల్లారిన తర్వాత అందులో సూక్ష్మజీవులు ఏర్పడుతాయి. ఈ తేలికపాటి బ్యాక్టీరియా ఆరోగ్యానికి హానికరం. ఆయుర్వేద టీకి ఇదే వర్తిస్తుంది. పదే పదే వేడి చేయడం వల్ల పోషకాలు తగ్గుతాయి.

3. ఆరోగ్యానికి హానికరం
పదేపదే వేడిచేసిన టీ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఎందుకంటే ఇందులో పోషకాలు ఏమి ఉండవు. మీరు ఈ అలవాటును మార్చుకోకపోతే చాలా కాలం తర్వాత కడుపు నొప్పి వస్తుంది. అంతేకాదు అల్సర్‌ లాంటి వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి.

4. మీరు 15 నిమిషాల తర్వాత టీని వేడి చేస్తే అది మీకు హాని చేయదు. కానీ చాలా సమయం తర్వాత టీ వేడి చేయడం మంచిది కాదు.

Kotak Mahindra Bank: సీనియర్‌ సిటిజన్లకు గుడ్ న్యూస్‌..! ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్..?

TV Display: టీవీ కొందామని అనుకుంటున్నారా? ఏ డిస్‌ప్లే టీవీ ఎలా ఉంటుంది.. టీవీ డిస్‌ప్లే రకాల గురించి పూర్తి సమాచారం..

Bhupendra Patel: అన్నీ చిన్నాచితకా పదవులే.. ఫస్ట్ టైం ఎమ్మెల్యే. సరాసరి సీఎం పదవితో భూపేంద్ర పటేల్‌ జాక్‌పాట్‌