Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే మీ శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతున్నట్లే..

మనిషి జీవించడానికి ఆహారం (Food) ఎంతో ముఖ్యం. ఆహారం జీర్ణం కావడం వల్లే అందులో ఉండే ప్రోటీన్లు శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి...

Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే మీ శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతున్నట్లే..
Health
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 02, 2022 | 7:28 AM

Health: మనిషి జీవించడానికి ఆహారం (Food) ఎంతో ముఖ్యం. ఆహారం జీర్ణం కావడం వల్లే అందులో ఉండే ప్రోటీన్లు శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. అలాగే పోషకాలు పోనూ మిగిలిన భాగం వ్యర్థాల రూపంలో తయారవుతాయి. అయితే ఈ వ్యర్థాలు ఎప్పటికప్పుడు శరీరం నుంచి బయటకు పోతేనే మనం ఆరోగ్యంగా (Health) ఉంటాం. అలా కాకుండా వ్యర్థాలు శరీరంలోనే పేరుకుపోతే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు. అయితే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయినట్లు మనకు ముందుగానే కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు అవేంటంటే..

* శరీరంలో వ్యర్థాలు ఎక్కువవుతున్నాయంటే ముందుగా కనిపించే లక్షణం జీర్ణ సమస్యలు. ముఖ్యంగా కడుపు ఉబ్బరంగా మారుతుంది. గ్యాస్‌, మలబద్దకం వంటి సమస్యలు ఉంటాయి. ఆకలి వేయదు, ఏమి తినాలనిపించదు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలు మన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని మీకు తెలుసా.? ముఖ్యంగా శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతే కంగారు, ఆందోళన, మతిమరుపు వంటివి వస్తాయి.

* శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతే చర్మంపై కూడా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చర్మంపై దద్దుర్లు, దురదలు, ఎర్రని మచ్చలు వస్తే అప్రమత్తమవ్వాలి.

* శరీరంలో వ్యర్థాల పరిమాణం పెరిగితే జుట్టు కూడా విపరీతంగా రాలిపోతుంది. అలర్జీ సమస్య వేధిస్తుంటుంది. ఇలాంటి ఎంతకీ తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

పరిష్కారమేంటీ..

మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా.. అంటే. కచ్చితంగా ఉందని చెప్పాలి. శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించేస్తూ ఉండాలి. ఇందుకోసం పరగడుపునే ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నేటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇది మంచి డిటాక్స్‌ డ్రింక్‌లా పనిచేస్తుంది. వీటితో పాటు కీరా, బీట్‌రూట్‌ జ్యూస్‌లను తీసుకోవడం వల్ల కూడా శరీరంలోని వ్యర్థాలు తొలగిపోయి. శరీరం శుభ్రంగా మారుతుంది.