నాన్ వెజ్ ప్రియులకు చికెన్, మటన్, రొయ్యలు, పీతలు ఇలా ఎన్ని రకాలున్నా.. చికెన్ ఉంటే చాలు ఆకలి లేదు అన్నవారు కూడా కూడా తినడానికి రెడీ అవుతారు.. లోట్టలేసుకుంటూ తినేస్తారు. ఈ చికెన్ తో కూరలు వేపుడు, పచ్చడి, బిర్యానీ వంటి రకరకాల పదార్ధాలను తయారు చేసుకుంటారు. అయితే గోదావరి జిల్లా వాసుల స్టైల్ లో కోడి మాసం వేపుడు వెరీ వెరీ స్పెషల్. ఈ చికెన్ ఫ్రై ను సాంబారు లేదా రసం కాంబినేషన్ తో తింటే ఆహా అనాల్సిందే ఎవరైనా..
మాంసాహార ప్రియులకు రోజూ ముక్క లేనిదే ముద్దదిగదు అంటారు. రోజూ తినే ఆహారం బోర్ కొట్టింది.. ఏదైనా డిఫరెంట్ గా ఉన్న ఆహారం కావాలని కోరుకుంటారు. ముఖ్యంగా మాంసాహార ప్రియులు రోజూ చికెన్ పెట్టినా సరే బోర్ కొట్టకుండా తినేస్తాం అని చెబుతారు. పిల్లలు , పెద్దలు కూడా భిన్నమైన రుచులతో కూడిన చికెన్ తోచేసిన కూరని తినాలని కోరుకుంటారు. చికెన్‌తో రకరకాల ఆహార పదార్ధాలను తయారు చేసుకోవచ్చు. అయితే ఎక్కువ మంది ఇష్టంగా తినే కోడి మాసం వేపుడిని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో తయారు చేసుకోవచ్చు.. ఈ రోజు ఆంధ్రా స్టైల్ చికెన్ ఫ్రై రెసిపీ తెలుసుకుందాం..
కోడి మాంసం వేపుడికి కావలసిన పదార్థాలు:
కోడి మాసం – ఒక కేజీ
ఉల్లిపాయలు – 4
పచ్చిమిరపకాయలు -4
అల్లం వెల్లుల్లి పేస్టు – 2 టీ స్పూన్లు
పెరుగు – 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం – ఒక చెక్క
కరివేపాకు- కొంచెం
నూనె – 5 టేబుల్ స్పూన్
చికెన్ మసాలా – 2 టేబుల్ స్పూన్లు
పసుపు – కొంచెం
కారం – 4 టీ స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర – ఒక కట్ట
వేపుడి కోసం మసాలా పొడికి కావాల్సిన పదార్ధాలు
ధనియాలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టీస్పూన్
యాలకులు – 3
లవంగాలు – 4
మిరియాలు – 10
దాల్చిన చెక్క- చిన్న ముక్క
సోంపుగింజలు – 1 టీస్పూన్
ఎండు మిరపకాయలు – 6
కాశ్మీరీ ఎండు మిరపకాయలు – 4
తయారీ విధానం:
ముందుగా చికెన్ ను శుభ్రం చేసుకుని.. చికెన్ ను ముక్కలుగా కట్ చేసుకుని వేసి ఒక గిన్నెలో ఆ చికెన్ ముక్కలను వేసి ఒక స్పూన్ ఉప్పు, పసుపు, కారం, పెరుగు, కొంచెం నిమ్మరసం వేసి చికెన్ ముక్కలకు పట్టించి మ్యారినేట్ చేసి ఒక పక్కకు పెట్టండి. ఇప్పుడు వేపుడుకి మసాలా రెడీ చేసుకోవాలి.
స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టి అందులో జీలకర్ర, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, యాలకులు, ఎండు మిర్చి, కాశ్మీర్ మిర్చి వేసి మంచి వాసన వచ్చే వరకూ వేయించండి. మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సి గిన్నెలో వేసుకుని మెత్తని పొడి పక్కకు పెట్టుకోండి..
ఇప్పుడు పాన్ పెట్టుకుని వేయించడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడి ఎక్కిన తర్వాత అందులో నిలువగా కట్ చేసుకున్న పచ్చి మిర్చి, సన్నగా ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత కరివేపాకు వేసి రెండు సెకన్లు వేయించాలి.
ఇప్పుడు వేయించిన ఉల్లిపాయల ముక్కల్లో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకుని కొంచెం సేపు వేయించాలి.
ఈ చికెన్ ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్టు , కొంచెం పసుపు వేసి వేయించాలి.. తర్వాత రెండు స్పూన్ల మసాలా పొడిని వేసి చికెన్ ను వేసి వేయించి .. చికెన్ వేగిన అనంతరం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
చికెన్ వేగిన తర్వాత కత్తిరించుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసి ఒక్క సారి కలిపి రెండు నిముషాలు స్విమ్ లో మంట పెట్టి వేయించాలి. చివరిగా ఇష్తమైన వారు వేయించిన జీడి పప్పు వేసుకోవాలి. అంతే ఆంధ్రా స్టైల్ లో కోడి మాంసం వేపుడు రెడీ. ఇది అన్నంలోకి చపాతీల్లోకి కూడా ఎంతో బాగుంటుంది..