Benefits Of Tamarind Leaves : సీజనల్ సమయంలో లభించే చింత చిగురుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..!

|

Mar 16, 2021 | 5:48 PM

ఆరు రుచుల్లో ఒకటి పులుపు.. ఈ రుచికి ఉన్న ప్రాధ్యాన్యత డిఫరెంట్ గా ఉంటుంది.. చింతచిగురు ను తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రాలో కూరగా చేసుకుంటారు. రుచికి పుల్లగా ఉండే ఈ చింత చిగురుతో అనేక కూరలు చేస్తారు...

Benefits Of Tamarind Leaves : సీజనల్ సమయంలో లభించే చింత చిగురుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..!
Chinta Chiguru Leaves
Follow us on

Benefits Of Tamarind Leaves : ఆరు రుచుల్లో ఒకటి పులుపు.. ఈ రుచికి ఉన్న ప్రాధ్యాన్యత డిఫరెంట్ గా ఉంటుంది.. చింతచిగురు ను తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రాలో కూరగా చేసుకుంటారు. రుచికి పుల్లగా ఉండే ఈ చింత చిగురుతో అనేక కూరలు చేస్తారు. నోటికి పుల్లటి రుచి ఇస్తూనే.. తినే కొద్ది తినాలనిపించే పులుపు తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.. ముఖ్యంగా పుల్ల పుల్లగా ఉండి.. జూన్ లో లభించే ఈ చింత చిగురు రుచికరమైన ఆహారమే కాదు… అనేక వ్యాధుల నివారణకారకంగా కూడా ఉపయోగపడుతుంది. సీజనల్ సమయంలో లభించే చింత చిగురు వల్ల లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

*చింత చిగురు లో ఎక్కువగా వున్న ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట రాల్ ను తగ్గించి.. అదే సమయంలో మంచి కొలెస్ట రాల్‌ను పెంచుతుంది.
* చింత చిగురులో ఉన్న యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలున్నాయి. దీంతో చిగురును ఉడికించి నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి.
* చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. చింత చిగురు పైల్స్ ఉన్న వారికి నివారణగా ఉపయోగపడుతుంది.
*వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే జ్వరాన్ని చింత చిగురు తగ్గిస్తుంది.
*నోటి పూత కు చింత చిగురు నివారిణిగా పనిచేస్తుంది.
* గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.
*శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
*. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
*జీర్ణాశయ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది.
*చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి.
* థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు చింత చిగురును తమ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
*.షుగర్ వ్యాధి గ్రస్తులు చింత చిగురు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
* చింత చిగురును ముద్దగా దంచి కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.
*ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారికి చింతచిగురు మేలు చేస్తుంది.
*కంటి సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది.

Also Read: గృహ రుణాలు తీసుకునే వారికి శుభవార్త.. వడ్డీ రేట్లను తగ్గించిన బ్యాంక్ ఆప్ బరోడా.. ఎంత తగ్గించిందో తెలుసా..

 ఫంక్షన్లకు భిన్నంగా రెడీ అవ్వాలనుకుంటున్నారా.. టాప్ టీవీ నటీమణుల వివాహ కలెక్షన్లు మీకోసం