Fake Medicines: నకిలీ ట్యాబ్లెట్స్‌ ఎలా గుర్తించాలో తెలుసా.?

నకిలీ మందులను కంపెనీ లోగో, పేరులో ఉండే తప్పుల ఆధారంగా గుర్తించవచ్చు. బ్రాండెండ్‌ కంపెనీల పేరుతో నకిలీ ఔషధాలను తయారీ చేసి విక్రయిస్తుంటారు. ఇలాంటి వాటిని కంపెనీ లోగో, పేరులో ఉండే స్పెలింగ్ మిస్టేక్స్‌ ఆధారంగా గుర్తించవచ్చు. ఔషధాలకు సంబంధించిన ఏమాత్రం అనుమానం వచ్చినా, అసలు ఔషధంతో పోల్చి చూసుకోవాలి....

Fake Medicines: నకిలీ ట్యాబ్లెట్స్‌ ఎలా గుర్తించాలో తెలుసా.?
Fake Medicines

Updated on: Mar 09, 2024 | 3:32 PM

ఆరోగ్యాన్ని కాపాడేందుకు ట్యాబ్లెట్స్‌ వేసుకుంటామని తెలిసిందే. అయితే ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఔషధాలే ఆరోగ్యాన్ని పాడు చేస్తే.. అవును ప్రస్తుతం మార్కెట్లో వస్తున్న నకిలీ ఔషధాలు కొత్త ఆరోగ్య సమస్యలను తీసుకొస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) అధికారులు చేసిన విచారణలో సంచనల నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఓ కంపెనీ చాక్‌ పౌడర్‌, గంజితో ఏకంగా యాంటీ బయోటిక్‌ మందులను తయారు చేసి మార్కెట్లోకి వదిలాయి. ఈ నేపథ్యంలో అసలు నకిలీ మందులను ఎలా గుర్తించాలి.? నకిలీ మందుల వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

నకిలీ మందులను కంపెనీ లోగో, పేరులో ఉండే తప్పుల ఆధారంగా గుర్తించవచ్చు. బ్రాండెండ్‌ కంపెనీల పేరుతో నకిలీ ఔషధాలను తయారీ చేసి విక్రయిస్తుంటారు. ఇలాంటి వాటిని కంపెనీ లోగో, పేరులో ఉండే స్పెలింగ్ మిస్టేక్స్‌ ఆధారంగా గుర్తించవచ్చు. ఔషధాలకు సంబంధించిన ఏమాత్రం అనుమానం వచ్చినా, అసలు ఔషధంతో పోల్చి చూసుకోవాలి. ప్యాకింగ్‌లో ఏమాత్రం తేడా కనిపించినా నకిలీ ఔషధంగా గమనించాలి.

ఇక ట్యాబ్లెట్స్‌ పరిమాణంలో తేడాలు ఉన్నా, విరిగిపోయినట్లు కనిపించినా సదరు ట్యాబ్లెట్స్‌ నకిలీవని గుర్తించాలి. ఇక అంతకు ముందు వాడిన మందుల కంపెనీలతో పోల్చితే ధర మరీ తక్కువగా ఉన్నా నకిలీవని గమనించాలి. ఇక 300 రకాల అత్యవసర మందులకు కచ్చితంగా బార్‌ కోడ్‌, క్యూఆర్‌ కోడ్‌ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. క్యూఆర్‌ కోడ్‌ లేకపోతే అనుమానించాలి.

ప్యాకేజ్‌ సరిగా లేకపోయినా.. సీల్‌ సరిగా లేకపోయినా నకిలీ ఔషధాలుగా అనుమానించాలి. ఇక మందు వేసుకున్న తర్వాత అలర్జీలు, ఇతర సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమైనా వస్తే వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలి. మీకు ఒకవేళ నకిలీ మందులుగా అనుమానం వస్తే డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800599696 కు సమాచారం అందించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..